Ramya Behara : అది నా నంబర్ కాదు.. బ్లాక్ చేయండి..

 ఇటీవల కాలంలో టెక్నాలజీని వాడుకొని మోసాలు చేసేవారు ఎక్కువ అయ్యారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా టెక్నాలజీని వాడుకొని జనాల్ని మోసం చేస్తున్నారు. గత కొంతకాలంగా సెలబ్రిటీల పేర్లు వాడుకొని...

Ramya Behara

Ramya Behara :   ఇటీవల కాలంలో టెక్నాలజీని వాడుకొని మోసాలు చేసేవారు ఎక్కువ అయ్యారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా టెక్నాలజీని వాడుకొని జనాల్ని మోసం చేస్తున్నారు. గత కొంతకాలంగా సెలబ్రిటీల పేర్లు వాడుకొని మరీ ఈ మోసాలు చేస్తున్నారు. జనాల దగ్గర డబ్బులు అడగడం వంటివి కూడా చేస్తున్నారు. ఇటీవల అనుపమ పరమేశ్వరన్ పేరుతో ఓ అమెరికా నంబర్ వాడి కాల్స్, మెసేజెస్ చేసి డబులు తీసుకోవడం లాంటివి చేశారు. దీనిపై అనుపమ స్పందిస్తూ అది నా నంబర్ కాదు నా పేరు వాడుకొని మోసం చేస్తున్నారు అని పోస్ట్ కూడా చేసింది.

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు

తాజాగా ఇదే సంఘటన సింగర్ రమ్య బెహరాకి ఎదురైంది. రమ్య బెహరా పేరుతో అమెరికా నంబర్ ని వాడి మెసేజెస్, కాల్స్ చేస్తున్నారు. డబ్బుల కోసం రమ్య బెహరా పేరు వాడుకొని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం రమ్య బెహరాకు తెలిసి ఆ నంబర్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” ఈ వ్యక్తి నా పేరు వాడుకొని అందరికి మెసేజెస్ చేస్తున్నాడు. దయచేసి రిప్లై ఇవ్వకండి. ఆ నంబర్ ని బ్లాక్ చేయండి. థ్యాంక్ యూ” అని పోస్ట్ చేసింది.