Rana Daggubati : ఆ హీరో – హీరోయిన్‌కి ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసిన రానా.. సినిమా ఓపెనింగ్ లో సందడి..

నేడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఓపెనింగ్ కార్యక్రమం జరగ్గా రానా దగ్గుబాటి గెస్ట్ గా వచ్చారు.

Rana Captured Tiruveer and Teena Sravya Photos in The Great Pre Wedding Show Movie Opening

Rana Daggubati : మసూద, పరేషాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన తిరువీర్ తాజాగా మరో కొత్త సినిమా ప్రకటించాడు. తిరువీర్ హీరోగా, టీనా శ్రావ్య హీరోయిన్ గా నేడు ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అనే సినిమా పూజా కార్యక్రమం జరిగింది. బై 7 పి.ఎం ప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి నిర్మాణంలో రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Rahul Vijay : ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ అంటున్న రాహుల్ విజయ్.. ఫస్ట్ లుక్ భలే ఉందే..

నేడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఓపెనింగ్ కార్యక్రమం జరగ్గా రానా దగ్గుబాటి గెస్ట్ గా వచ్చారు. రానా ద‌గ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగ‌రం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అయితే ఈ ఈవెంట్ లో సరదాగా రానా కెమెరా పట్టుకొని హీరో – హీరోయిన్ ని ఫొటోలు తీశారు. సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అవడంతో ప్రీ వెడ్డింగ్ స్టైల్ లో ఫొటోలు అని సరదాగా ఫొటోలు తీశారు రానా. దీంతో రానా ఫొటోలు వైరల్ గా మారాయి. అలాగే మూవీ టీం అందరితో కలిసి రానా పెళ్లి ఫోటో దిగినట్టు ఫొటోలు దిగారు.

ఈ సినిమా పెళ్లి, ప్రేమ, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ పై కామెడీగా ఉండబోతుందని సమాచారం. ఇక దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమాని కామెడీ జానర్లోనే తీస్తున్నాము. నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెడుతున్నాం. ఎస్‌.కోట‌, వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నాం అని తెలిపారు.