Rahul Vijay : ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ అంటున్న రాహుల్ విజయ్.. ఫస్ట్ లుక్ భలే ఉందే..
వరుస సినిమాలు, సిరీస్ లు చేసుకుంటూ దూసుకెళ్తున్న రాహుల్ విజయ్ తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించాడు.

Rahul Vijay New Movie Khel Khatam Darwajaa Bandh Poster Title Released By Rana
Rahul Vijay : వరుస సినిమాలు, సిరీస్ లు చేసుకుంటూ దూసుకెళ్తున్న రాహుల్ విజయ్ తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. డియర్ మేఘ, భాగ్ సాలే.. లాంటి డిఫరెంట్ సినిమాలు తీసిన వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మాణంలో అశోక్ రెడ్డి కడదూరి దర్శకత్వంలో రాహుల్ విజయ్ హీరోగా, నేహా పాండే హీరోయిన్ గా నేడు కొత్త సినిమాని ప్రకటించారు.
Also Read : Unstoppable With NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 రాబోతుంది.. రేపే అనౌన్స్.. ప్రోమో కూడా..?
ఈ కొత్త సినిమాకు ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ అనే టైటిల్ ని ప్రకటించారు. రానా దగ్గుబాటి చేతుల మీదుగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. రానా ఈ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలిపి మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ పోస్టర్ చూస్తుంటే ఓ ఇంట్లో ఎవరికో భయపడి హీరో, హీరోయిన్స్ దాక్కున్నట్టు ఉంది. అయితే ఇది ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని మూవీ యూనిట్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని డీటెయిల్స్ ప్రకటించనున్నారు. ఇందులో రాహుల్ విజయ్, నేహా పాండే జంటగా నటిస్తుండగా అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Here’s the first look and title of #KhelKhatamDarwajaaBandh. Wishing the #KKDB team all the very best!👍🏻@ActorRahulVijay #NehaPanday@arjundasyan @VCWOfficial #AshokReddy #SureshBobbili @GskMedia_PR pic.twitter.com/7gHkn4wbFe
— Rana Daggubati (@RanaDaggubati) October 10, 2024