Virata Parvam: విరాటపర్వం.. ఇది అందరూ మెచ్చే ప్రేమకావ్యం!
టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రాజెక్టుల్లో ‘విరాటపర్వం’ ఎప్పుడో షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ.....

Rana Daggubati Sai Pallavi Comments On Virata Parvam Movie
Virata Parvam: టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రాజెక్టుల్లో ‘విరాటపర్వం’ ఎప్పుడో షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. కరోనా ప్రభావం తగ్గినా కూడా ఈ సినిమా రిలీజ్‌ను కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చింది చిత్ర యూనిట్. యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు క్రియేట్ చేశాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ కావడంతో, ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాను భాగోద్వాగాలు, ప్రేమ, విప్లవం వంటి అంశాలతో దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌కు మాసివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ సినిమాను జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో, ఈ చిత్ర ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో విరాటపర్వం చిత్ర టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Virata Parvam: విరాటపర్వం ట్రైలర్ లాంఛ్ వేదిక వద్ద ప్రమాదం.. తప్పిన ముప్పు
ఈ ప్రెస్ మీట్‌లో హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, నిర్మాత శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సినిమాను తామందరం ప్రాణం పెట్టి తీశామని.. ఇది అందరూ మెచ్చే ప్రేమకావ్యంగా ఖచ్చితంగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని.. ఇందులో ఓ సగటు ఆడియెన్స్ కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో రానా నక్సల్ లీడర్‌గా కనిపిస్తుండగా, అతడిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయి పాత్రలో సాయి పల్లవి మరోసారి అద్భుతమైన పర్పార్మెన్స్ ఇచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరి ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ నెల 17 వరకు వెయిట్ చేయాల్సిందే.