Rana Daggubati : అడివి శేష్ దర్శకత్వంలో రానా హీరోగా సినిమా?

రానా త్వరలో అడివి శేష్(Adivi Sesh) దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.

Rana Daggubati : అడివి శేష్ దర్శకత్వంలో రానా హీరోగా సినిమా?

Rana Daggubati will do a movie in Adivi Sesh Direction Rumours goes Viral

Rana Daggubati : రానా దగ్గుబాటి లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అనంతరం వరుసగా తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీ అయ్యాడు. హీరోగానే కాక విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ రోల్స్ లో కూడా మెప్పిస్తున్నాడు. మరో పక్క నిర్మాతగా కూడా పలు చిన్న సినిమాలని రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవల స్పై సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు రానా. త్వరలో ప్రభాస్ కల్కి, తలైవర్ 170, మరిన్ని సినిమాలతో రాబోతున్నాడు.

అయితే రానా త్వరలో అడివి శేష్(Adivi Sesh) దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. యువ హీరో అడివిశేష్ తక్కువ బడ్జెట్ తో, ఆసక్తికర, థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ ని ఎంచుకొని ఆ కథలతో మంచి మంచి విజయాలు సాధిస్తున్నాడు. కొత్త కథలు ఇస్తాడని, తక్కువ బడ్జెట్ లో పెద్ద సక్సెస్ సాధిస్తాడని అడివి శేష్ కి మంచి పేరు ఉంది. అడివి శేష్ రచయిత, దర్శకుడు కూడా. త్వరలో గూడాచారి 2 సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత మరిన్ని ప్రాజెక్ట్స్ అడివి శేష్ చేతిలో ఉన్నాయి.

తాజాగా రానా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గోవాలో ఓ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళినప్పుడు అడివి శేష్ నా దగ్గరకు వచ్చి నీ సినిమాలంటే నాకు ఇష్టం. ఎందుకు వరుసగా సినిమాలు చెయ్యట్లేదు, గ్యాప్ ఎక్కువగా తీసుకుంటున్నావు అని అడిగాడు. అవునా, సరే ఎక్కువ సినిమాలు చేయడానికి ట్రై చేస్తాలే అని చెప్పాను. అప్పుడు శేష్.. నీ కోసం నేను ఒక కథ రాస్తాను. ఏడాది లోపు నీ దగ్గరకు వస్తాను. ఆ సినిమా నువ్ చేయాలి అని అన్నాడు. అలా మనం పని చేయాలని కోరుకునేవాళ్ళు ఉన్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది అని తెలిపాడు.

Also Read : Leo Collections : ‘లియో’ సరికొత్త రికార్డ్.. నాలుగు రోజుల్లోనే 400 కోట్లు.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే..

దీంతో అడివి శేష్ రాసిన కథలో రానా నటిస్తాడని తెలుస్తుంది. మరి దానికి నటుడిగా బిజీగా ఉన్న అడివి శేష్ దర్శకత్వం వహిస్తాడా లేక వేరే ఎవరైనా డైరెక్షన్ చేస్తారా చూడాలి. కొత్త కొత్త కథలను, మంచి సినిమాలని ముందుకు తీసుకురావడానికి ఈ జనరేషన్ హీరోలు ట్రై చేస్తున్నారని ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక వీరిద్దరూ కలిసి బాహుబలి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.