Rana Naidu : నెట్‌ఫ్లిక్స్ నుంచి రానా నాయుడు డిలీట్.. కారణం ఏంటి?

వెంకటేష్ (Daggubati Venkatesh), రానా (Rana Daggubati) కలిసి నటించిన 'రానా నాయుడు' (Rana Naidu) వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో కనిపించడం లేదు. తెలుగుకి సంబంధించిన ఆడియోని నెట్‌ఫ్లిక్స్ తొలిగించింది.

Rana Naidu : దగ్గుబాటి హీరోలు వెంకటేష్ (Daggubati Venkatesh), రానా (Rana Daggubati) కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). ప్రస్తుతం వెబ్ సిరీస్ కల్చర్ నడుస్తుండడంతో స్టార్ హీరో హీరోయిన్లు సైతం వాటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్, రానా కూడా మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించారు. అయితే ఈ సిరీస్ ఇప్పటివరకు వచ్చిన సిరీస్ తో పోలిస్తే కొంచెం ఎక్కువ అడల్ట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. దీంతో ప్రేక్షకుల నుంచి చాలా వ్యతిరేకత ఎదురుకుంది. ప్రథమంగా హిందీ భాషలో తెరకెక్కిన ఈ సిరీస్ ని మార్చి 10న తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశారు.

Saindhav : వెంకీ మామ మాస్ రూపం.. క్రిస్మస్ రిలీజ్‌కి రెడీ అంటున్న సైంధ‌వ్..

కాగా తెలుగులో వెంకటేష్ కి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉంది. అయితే రానా నాయుడులో మాత్రం దానికి పూర్తి బిన్నంగా వెంకటేష్ పాత్ర ఉంది. దీంతో తెలుగు ఆడియన్స్ అంగీకరించలేక పోయారు. అలాగే ఎక్కువ అశ్లీల సన్నివేశాలతో తెరకెక్కడం, అభ్యంతరకర భాష ఉండడంతో తెలుగు ఆడియన్స్ రానా నాయుడు పై విమర్శలు చేశారు. టాలీవుడ్ సెలబ్రేటిస్ సైతం దానిని ఒక బూత్ సినిమా అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్ కనిపించడం లేదు. తెలుగుకి సంబంధించిన ఆడియోని నెట్‌ఫ్లిక్స్ తొలిగించింది.

Rana Naidu : రానా నాయుడు.. ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఈ రేంజ్ అడల్ట్ సిరీస్ ని ఎలా ఓకే చేశాడు?

ఇందుకు గల కారణం మరో వెబ్ సిరీస్ కారణం అని తెలుస్తుంది. అమెరికన్ సిరీస్ ‘ది బిగ్ బాంగ్ థియరీ’లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ను అవమానపరిచేలా సన్నివేశాలు ఉన్నాయి అంటూ ఇటీవల వివాదం రేగింది. దీంతో ఈ షో ప్రసారం చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థకి లీగల్ నోటీసులు కూడా వెళ్లాయి. ఈ క్రమంలోనే రానా నాయుడు విషయంలో జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. తెలుగు నుంచి వ్యతిరేకత రావడం, తొలిగించాలని డిమాండ్‌లు వస్తుండడంతో.. సమస్య పెద్దది కాకముందే జాగ్రత్తపడే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు