Rana Naidu : రానా నాయుడు.. ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఈ రేంజ్ అడల్ట్ సిరీస్ ని ఎలా ఓకే చేశాడు?

సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సిరీస్ లలో బూతులు, బోల్డ్ కంటెంట్ ఉంటుందని తెలిసిందే కానీ తెలుగు హీరోలని తీసుకొని ఈ రేంజ్ లో అడల్ట్ కంటెంట్ పెట్టి తీయడంతో తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా వెంకటేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..............

Rana Naidu : రానా నాయుడు.. ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఈ రేంజ్ అడల్ట్ సిరీస్ ని ఎలా ఓకే చేశాడు?

Trolls on Venkatesh and Rana series Rana Naidu dont watch with family said by audience

Rana Naidu :  ఇటీవల స్టార్ హీరోలు, ఆర్టిస్టులు అంతా ఓటీటీ బాట పట్టి పలు వెబ్ సిరీస్ లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి బాబాయ్ – అబ్బాయిలు వెంకటేష్-రానా కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు. నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో భారీగా తెరకెక్కిన రానా నాయుడు సిరీస్ మార్చ్ 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ముందే రిలీజ్ చేసిన ట్రైలర్, వెంకటేష్ -రానా కలిసి నటిస్తుండటంతో ఈ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూసి ఇది తండ్రి, కొడుకుల మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ లా ఉండే సిరీస్ అనుకున్నారు.

 

కానీ రిలీజ్ తర్వాత ఈ సిరీస్ పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ అడల్ట్, బోల్డ్ కంటెంట్, వల్గర్ లాంగ్వేజ్ ఉండటమే కారణం. రానా ప్రమోషన్స్ లో ముందుగానే చెప్పాడు ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడొద్దని, సింగిల్ గానే చూడమని. అయినా వెంకటేష్ ఫ్యామిలీ హీరో కావడంతో చాలా మంది ఈ సిరీస్ ను చూశారు. అయితే మాములుగా బోల్డ్ కంటెంట్ ఉన్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ లోను న్యూడిటీ, వయోలెన్స్, బూతులు.. ఇలా అన్ని అడల్ట్ సిరీస్ లో ఉండే అంశాలు ఉన్నాయి. వెంకటేష్ తో కూడా పచ్చిగా బూతులు మాట్లాడిస్తూ, బోల్డ్ సీన్స్ లోను కనపడేలా చేశారు.

సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సిరీస్ లలో బూతులు, బోల్డ్ కంటెంట్ ఉంటుందని తెలిసిందే కానీ తెలుగు హీరోలని తీసుకొని ఈ రేంజ్ లో అడల్ట్ కంటెంట్ పెట్టి తీయడంతో తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా వెంకటేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం స్టోరీ, స్క్రీన్ ప్లే అయినా బాగుందా అంటే అదీ లేదు. తండ్రి కొడుకుల మధ్య పోరాటం అనుకున్నా ఏవో కొన్ని సీన్స్ తప్ప అసలు రానా, వెంకటేష్ మధ్య సన్నివేశాలే లేవు. దానికి తోడు స్లో నేరేషన్. సిరీస్ మొత్తంలో వెంకటేష్, రానా కాకుండా తెలుగు వాళ్ళకి తెలిసిన నటులు అంటే ఒక 10 మంది ఉంటారేమో, అది కూడా వేరే భాష వాళ్ళే. కథలో మొదటి నుంచి రానా వెంకటేష్ ని ద్వేషిస్తూ ఉంటాడు, దానికి కొన్ని కారణాలు చెప్పినా సరైన కారణం మాత్రం చెప్పలేదు, చూపించలేదు. సిరీస్ చివర్లో వెంకటేష్ రానాని అడిగినా కూడా చిన్నప్పటి నుంచి తండ్రిగా సరిగ్గా పట్టించుకోలేదు అనే చెప్తాడు. వెంకటేష్ బ్యాక్ సైడ్ స్టోరీ చూపించకపోవడంతో అసలు వెంకీ మామ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఇచ్చినట్టు ఉండదు. వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయిడు సిరీస్ ని అసలు తెలుగు ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకోకుండా బాలీవుడ్, హాలీవుడ్ లో తీసినట్టు తీయడంతో ఇక్కడి ప్రేక్షకుల నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కి పేరు ఉంది. అలాంటి హీరో ఇలాంటి ఒక బోల్డ్ సిరీస్ ని ఎలా చేశాడు అని తెలుగు ప్రేక్షకులు, అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

అయితే కొంతమంది మాత్రం కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి చేశారు అని సపోర్ట్ కూడా చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ సిరీస్ లు ఇష్టపడే కొంతమందికి మాత్రం ఈ సిరీస్ నచ్చుతుంది. వెంకటేష్, రానా కూడా ఈ సిరీస్ విషయంలో పాజిటివ్ గానే ఉన్నారు. ఎప్పుడూ చేసే రోల్స్ కి డిఫరెంట్ గా చేయాలని ఇది చేశామని ముందునుంచి చెప్తూనే ఉన్నారు. ఈ సిరీస్ పై సోషల్ మీడియాలో, మీడియాలో దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. అయితే సిరీస్ కి సపోర్ట్ గా వేస్తున్న కొన్ని పోస్టులని రానా తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ సిరీస్ ని మరింత ప్రమోట్ చేస్తున్నారు.

Amithab Bachchan : ప్రాజెక్ట్ K షూటింగ్‌లో గాయంపై అమితాబ్ మరో పోస్ట్.. కంగారుపడుతున్న అభిమానులు..

ఒకవేళ ఎవరైనా రానా నాయుడు సిరీస్ చూడాలంటే ఒక్కరే చూడండి. అస్సలు ఫ్యామిలీతో కలిసి చూడకండి.