Rana – RGV : రానా విత్ ఆర్జీవీ.. స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతుంది.. ఆర్జీవీ పోస్ట్ వైరల్..
ఈసారి ఏకంగా రానా దగ్గుబాటికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆర్జీవీ.

Rana With RGV Special Interview Happened Working Stills and Ram Gopal Varma Post Goes Viral
Rana – RGV : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఒకప్పుడు తన సినిమాలతో సంచలనం సృష్టించినా ఇప్పుడు తన పోస్టులతో హల్ చల్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి తనిష్టం అంటూ ఏవేవో సినిమాలు చేసుకుంటున్నాడు ఆర్జీవీ. అయితే ఆర్జీవీ ఏం చేసినా ఆయన్ని అభిమానించే వాళ్ళ సంఖ్య మాత్రం తగ్గక పోగా పెరుగుతూనే ఉంది. ఆయన ఇంటర్వ్యూలు బాగా వైరల్ అవుతాయి. ఈ నేపథ్యంలో ఆర్జీవీ మరో ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈసారి ఏకంగా రానా దగ్గుబాటికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆర్జీవీ. అమెజాన్ ప్రైమ్ కోసం ఈ ఇంటర్వ్యూ చేసినట్టు ఆర్జీవీ తెలిపాడు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తీసిన వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేస్తూ ఆర్జీవీ.. రానా దగ్గుబాటి ట్యాలెంట్ చూసి ఆశ్చర్యపోయాను. నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, హోస్ట్.. ఇలా ఎన్నో తెలుసు. దేవుడికి తెలిసినవన్నీ రానాకు తెలుసు అనుకుంట. అమెజాన్ కోసం ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చేశాం. నా లైఫ్ ని, నా డైరెక్షనల్ కెరీర్ ని తీర్చిదిద్దింది ఎవరు అనే కాన్సెప్ట్ మీద మాట్లాడాను అని తెలిపారు.
దీంతో ఆర్జీవీ ఫ్యాన్స్ ఈ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రానా – ఆర్జీవీ ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.