Ranbir Kapoor : పాకిస్థానీ సినిమాల్లో నటిస్తా.. వివాదం అయిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రణబీర్..

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గతేడాది డిసెంబర్ లో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో ఓ పాకిస్థాన్ నిర్మాత పాకిస్థానీ సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడగగా దానికి రణబీర్..................

Ranbir Kapoor :  సినీ పరిశ్రమ లేదా ఏదైనా కళల విభాగంలో ఉన్నవారు ఎక్కడైనా పని చేయొచ్చు. కళలకు హద్దులు లేవు అంటారు. మన సినీ పరిశ్రమలలోని నటులు వేరే దేశాల్లోని ఏ సినీ పరిశ్రమలో అవకాశాలు వచ్చినా వెళ్లి నటిస్తారు. కానీ ఇందుకు పాకిస్థాన్ మినహాయింపు. మన దేశానికి, పాకిస్థాన్ కి ఉన్న సమస్యల వల్ల ఇక్కడి నటులు పాకిస్థానీ సినిమాల్లో అంత తొందరగా నటించరు. కానీ పాకిస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఇండియా సినిమాలో నటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.

మన దేశానికి, పాకిస్థాన్ కి ఉన్న గొడవల వల్ల ఇక్కడ ఎవరైనా పాకిస్థాన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడినా విమర్శలు తప్పవు. ఇటీవల ఆ విమర్శలు రణబీర్ కపూర్ ఎదుర్కున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గతేడాది డిసెంబర్ లో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో ఓ పాకిస్థాన్ నిర్మాత పాకిస్థానీ సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడగగా దానికి రణబీర్.. కచ్చితంగా నటిస్తాను, ఆర్టిస్టులకు, కళలకు హద్దులు ఉండవని నేను నమ్ముతాను అని అన్నారు. దీంతో రణబీర్ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. ఇండియాలోని పలువురు ఈ వ్యాఖ్యలపై రణబీర్ ని విమర్శిస్తూ అసలు పాకిస్థాన్ సినిమాల్లో ఎలా నటిస్తావు అంటూ ఫైర్ అయ్యారు.

Kiara Advani : పెళ్లి హంగామా ముగిసింది.. బ్యాక్ టు వర్క్ అంటూ కియారా స్పెషల్ సెల్ఫీ…

తాజాగా రణబీర్ ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రణబీర్ తన నెక్స్ట్ సినిమా తు ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు రణబీర్ ని ఈ వివాదంపై అడగగా రణబీర్ స్పందిస్తూ..నేను మాట్లాడిన మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను ఆ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళాక అక్కడికి చాలా మంది పాకిస్థాన్ సినీ పరిశ్రమ వాళ్ళు కూడా వచ్చారు. అలాంటి సందర్భంలో ఈ ప్రశ్న అడిగారు. అప్పుడు అక్కడ వివాదం అవ్వకూడదు అని నేను నటిస్తాను అని చెప్పాను. నాకు సినిమాలే ముఖ్యం. నాకు చాలా మంది పాకిస్థాన్ సినీ వ్యక్తులు తెలుసు. వాళ్ళు ఇండియన్ సినిమాల్లో పనిచేస్తున్నారు. సినిమాకు, కళకు హద్దులు ఉండవని నేను నమ్ముతాను. కానీ కళ కంటే దేశం పెద్దది. అలాంటి సమయంలో నేను దేశానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాను అని అన్నారు. మరి రణబీర్ ఇచ్చిన ఈ క్లారిటీపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు