Ranbir – Alia : అలియా ఎంకరేజ్ వల్లే.. ‘యానిమల్’లో ఇంటిమేట్ సీన్స్ చేశా.. రణబీర్ కామెంట్స్
అలియా ఎంకరేజ్ చేయడం వల్లే 'యానిమల్' సినిమాలోని ఇంటిమేట్ సీన్స్ చేసినట్లు రణబీర్ చెప్పుకొచ్చారు.

Ranbir Kapoor done intimate scenes in animal movie with Alia Bhatt permission
Ranbir Kapoor – Alia Bhatt : బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్.. ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ జోష్ లో ఉన్నారు. అలియా రీసెంట్ గా నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంటే, రణబీర్ ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీతో 900 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి కెరీర్ హైయెస్ట్ ని నమోదు చేసుకున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా రష్మిక, త్రిప్తి దిమ్రి హీరోయిన్స్ గా నటించారు.
కాగా ఈ మూవీలో హీరో హీరోయిన్ మధ్య చాలా వరకు ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ చేయడానికి రణబీర్ కూడా ముందుగా సందేహంలో నిలిచారట. అయితే అలియా భట్ తనని ఎంకరేజ్ చేసి.. ఆ ఇంటిమేట్ సీన్స్ చేయడానికి రణబీర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. యానిమల్ సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం గురించి రణబీర్, అలియాతో మాట్లాడేవారట. ఈక్రమంలోనే ఈ ఇంటిమేట్ సీన్స్ గురించి కూడా చెప్పారట.
Also read : Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ ప్లేస్‌లోకి అట్లీ వచ్చాడా..? తన సినిమాని తానే రీమేక్ చేయబోతున్నాడా..?
ఆ సీన్స్ చేయడానికి రణబీర్ సందేహ పడుతుంటే.. అలియా ధైర్యం చెప్పి పాత్రకి ఏం కావాలో అవి చెయ్యి అని ఎంకరేజ్ చేశారట. కాగా ఈ సన్నివేశాలు పై చాలా మంది ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన కల్చర్ ని మించి సీన్స్ చిత్రీకరణ ఉందని పలువురు అసహనం తెలియజేశారు. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాని ఆదరించిన ఆడియన్స్ అంతా.. దీని సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు.
‘యానిమల్ పార్క్’ టైటిల్ తో సీక్వెల్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సీక్వెల్ లో మరింత ఇంటిమేట్ అండ్ వైలెన్స్ సీక్వెన్స్ ఉండబోతుందంటూ సందీప్ వంగ తెలియజేశారు. ఇక ఈ యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్ ని జనవరి 26న ఉండబోతుందని సమాచారం. థియేటర్ లోకి ఈ సినిమా 3 గంటల 21 నిమిషాల నిడివితో వచ్చింది. అయితే ఓటీటీలో మరో 8 నిమిషాలు జతచేసుకొని 3 గంటల 29 నిమిషాల రన్ టైంతో స్ట్రీమ్ కాబోతుంది.