Ranbir Kapoor : మా ఇంట్లో టెన్త్ పాసైన మొదటి వ్యక్తి నేనే.. పాస్ అయినందుకే పెద్ద పార్టీ చేశారు..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన స్టడీ గురించి, టెన్త్ మర్క్స్ గురించి అడగగా రణబీర్ మాట్లాడుతూ.. ''పదో తరగతిలో నాకు కేవలం 53% మాత్రమే వచ్చాయి. నేను ఆ మార్కులతో పాస్ అయినందుకు........

Ranbir Kapoor : మా ఇంట్లో టెన్త్ పాసైన మొదటి వ్యక్తి నేనే.. పాస్ అయినందుకే పెద్ద పార్టీ చేశారు..

Ranbir Kapoor

Updated On : July 11, 2022 / 7:26 AM IST

Ranbir Kapoor :  చాలా మంది స్టార్స్ కెరీర్ తొందరగా మొదలుపెట్టడం లేదా ఇంట్లో అంతా సినిమా వాళ్ళు ఉండటంతో అటు వైపు ఆసక్తి ఉండటంతో చదువు మీద ఎక్కువ ఆసక్తి చూపారు. టాలీవుడ్, బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ టెన్త్, ఇంటర్ తోనే ఆపేసారు అయినా సినిమాల్లో తమ ట్యాలెంట్ చూపించి స్టార్స్ గా ఎదిగారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ టెన్త్ లో జస్ట్ పాస్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Sonakshi Sinha : నా పెళ్లి గురించి మీకెందుకు??

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన స్టడీ గురించి, టెన్త్ మర్క్స్ గురించి అడగగా రణబీర్ మాట్లాడుతూ.. ”పదో తరగతిలో నాకు కేవలం 53% మాత్రమే వచ్చాయి. నేను ఆ మార్కులతో పాస్ అయినందుకు మా ఇంట్లోవాళ్లు పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. మా కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరూ పదో తరగతి పాసవ్వలేదు. మా నాన్న 8, అంకుల్‌ 9, తాతయ్య 6వ తరగతి వరకే చదివారు. అసలు నేను కూడా పాస్ అవ్వను అనుకున్నారు. కానీ ఆ మార్కులు రావడంతో మా ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు” అని తెలిపాడు. టెన్త్ లో యావరేజ్ గా పాస్ అయినా ఆ తర్వాత యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళాడు. ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు రణబీర్.