Sonakshi Sinha : నా పెళ్లి గురించి మీకెందుకు??

ఇటీవల బాలీవుడ్ స్టార్ కిడ్, దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై ఇలాంటి కథనాలే వచ్చాయి. సోనాక్షి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని, ఫలానా వారితో ప్రేమలో ఉంది అని కథనాలు వచ్చాయి. అంతేకాదు...........

Sonakshi Sinha : నా పెళ్లి గురించి మీకెందుకు??

Sonakshi

Updated On : July 11, 2022 / 7:02 AM IST

Sonakshi Sinha :  మీడియా, నెటిజన్లు, అభిమానులు, ప్రేక్షకులు సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూస్తారు. వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశపడతారు. ముఖ్యంగా వాళ్ళ ప్రేమ, పెళ్లి వ్యవహారాల మీద మరీ ఆసక్తి చూపిస్తారు. హీరో, హీరోయిన్స్ ఎవరితోనైనా క్లోజ్ గా కనిపిస్తే ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కథనాలు వస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. బాలీవుడ్ లో అయితే ఈ గాసిప్స్ మరీ ఎక్కువ.

ఇటీవల బాలీవుడ్ స్టార్ కిడ్, దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై ఇలాంటి కథనాలే వచ్చాయి. సోనాక్షి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని, ఫలానా వారితో ప్రేమలో ఉంది అని కథనాలు వచ్చాయి. అంతేకాదు సోనాక్షి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎక్కువగా అడుగుతున్నారట. దీంతో ఇలాంటి వాటిపై సీరియస్ అయింది సోనాక్షి.

Radhika Apte : నా భర్త అక్కడ.. నేను ఇక్కడ.. పెళ్లయి పదేళ్లు అయినా..

ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ”నాకు అప్పుడే పెళ్లేంటి. ఇంట్లో వాళ్ల కన్నా జనాలకే నా పెళ్లి మీద ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రస్తుతానికి నా జీవితాన్ని వేరే వాళ్ళతో పంచుకునేందుకు రెడీగా లేను. నేనెప్పుడు సినిమాల గురించి మాట్లాడినా, ఎదుటివారు మాత్రం వ్యక్తిగత విషయాలనే అడుగుతారు, వాటి గురించే ఇష్టమొచ్చినట్టు రాస్తారు. నేనేం చెప్పకపోయినా వాళ్ళకి వాళ్ళే ఏదో ఒకటి ఊహించుకొని రాసేస్తారు. నా పెళ్లి గురించి మీకెందుకు. మా ఇంట్లో వల్లే అడగట్లేదు” అని ఫైర్ అయింది.