సమాధిని ప్రపంచ వింతగా చూడాలా? కొత్త కాంట్రవర్సీలో కంగనా చెల్లి

బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ సోదరి రంగోలి తాజ్ మహల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది..

  • Published By: sekhar ,Published On : April 8, 2020 / 12:22 PM IST
సమాధిని ప్రపంచ వింతగా చూడాలా? కొత్త కాంట్రవర్సీలో కంగనా చెల్లి

Updated On : April 8, 2020 / 12:22 PM IST

బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ సోదరి రంగోలి తాజ్ మహల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది..

కంగనా రనౌత్, రంగోలి చందేల్ ఇద్దరికీ కాంట్రవర్సీ అంటే మహా ఇష్టం. ముక్కుసూటిగా మాట్లాడడం, తప్పు అనిపిస్తే ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద హోదాలో ఉన్నా చెడామడా దులిపెయ్యడం కంగానా స్టైల్ అయితే.. అక్కని సమర్థిస్తూ ఆమె మీద ఈగ వాలనివ్వకుండా చూడడం చెల్లి రంగోలి పని.. తాజాగా రంగోలి తాజ్ మహల్ గురించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. నెటిజన్లు రంగోలిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

తాజ్ మహల్‌ను చాలామంది సమాధిగానే భావిస్తారు.. కానీ దీనిని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారంటూ రంగోలి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘తాజ్‌ మహల్‌ను చాలా మంది సమాధిగానే పరిగణిస్తారు. అయితే దీనిని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు..

Read Also : ‘ఐకాన్’ కనబడుటలేదు.. కానీ ఆగిపోలేదు..

ముంతాజ్‌పై ఉన్న ప్రేమ, గౌరవంతో షాజాహాన్‌ నిర్మించిన ఈ అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో ఉన్నాయి, ఆమెను షాజహాన్‌ ఎంతగా హింసించేవాడో మీకు తెలుసా?..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రంగోలి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తాజ్ మహల్ ప్రపంచ వింతల్లోనే ఏడవది.. ఈ విషయం చరిత్రే చెబుతోంది.. నీ అభిప్రాయం ఎవరికి కావాలి’ అంటూ రంగోలిపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.