×
Ad

Dhurandhar : ‘ధురంధర్’ సరికొత్త రికార్డ్.. ఓటీటీ రైట్స్ ఎన్ని వందలకోట్లకు అమ్ముడయిందో తెలుసా?

ఇప్పటికే ధురంధర్ సినిమా థియేటర్స్ లో 700 కోట్లకు పైగా వసూలు చేసింది. (Dhurandhar)

Dhurandhar

Dhurandhar : రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన బాలీవుడ్ సినిమా ధురంధర్ ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఇండియా – పాకిస్థాన్ మధ్య జరిగిన కొన్ని రియల్ సంఘటనలతో, జాతీయభావంతో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయి భారీ కలెక్షన్స్ ని కురిపిస్తుంది. బాలీవుడ్ తో పాటు దేశమంతా ఈ సినిమా గురించి చర్చ జరుగుతుంది.(Dhurandhar)

ఇప్పటికే ధురంధర్ సినిమా థియేటర్స్ లో 700 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుందని సమాచారం. తాజాగా ఈ సినిమాపై వచ్చిన ఓ వార్త చర్చగా మారింది.

Also Read : Peddi : ఏకంగా పీఎం ఆఫీస్ లో పెద్ది షూటింగ్..? ఢిల్లీలో బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడ్రా బాబు..

ధురంధర్ సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించడంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయట. ధురంధర్ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 285 కోట్లు పెట్టి కొనుక్కున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ లో ఇప్పటివరకు అత్యధిక ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన సినిమాగా ధురంధర్ నిలుస్తుంది.

ఈ రేట్ విని బాలీవుడ్ సినీ పరిశ్రమ ఆశ్చర్యపోతుంది. గతంలో పుష్ప 2, RRR సినిమాలకు ఈ రేంజ్ లో ఓటీటీ బిజినెస్ అయింది. బాలీవుడ్ లో అయితే ఇదే మొదటిసారి కావడంతో ధురంధర్ మరింత వైరల్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కి వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేయగా అది మార్చ్ లో రిలీజ్ అవుతుందని సమాచారం.

Also Read : Inaya Sulthana : 3 రోజెస్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన బిగ్ బాస్ భామ.. ఇనయా సుల్తానా ఫొటోలు..