Rao Ramesh : రావు రమేశ్ గొప్ప మనుసు.. ఆ కుటుంబానికి రూ. 10 లక్షల సాయం..

ఇటీవల నటుడు రావు రమేశ్‌ దగ్గర పనిచేసే పర్సనల్ మేకప్ మ్యాన్ బాబు అనారోగ్య సమస్యలతో మరణించాడు. ఇతను చాలా కాలంగా రావు రమేశ్ దగ్గరే పనిచేస్తున్నాడు. అతని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తాజాగా ఆ మేకప్ మ్యాన్ కుటుంబాన్ని...............

Rao Ramesh : రావు రమేశ్ గొప్ప మనుసు.. ఆ కుటుంబానికి రూ. 10 లక్షల సాయం..

Rao Ramesh helps to his personal makeupman family

Updated On : September 17, 2022 / 7:28 AM IST

Rao Ramesh :  రావు గోపాలరావు తనయుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు రావు రమేశ్. తనదైన నటనతో, విభిన్న పాత్రలతో అందర్నీ మెప్పించి స్టార్ ఆర్టిస్ట్ గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తాజాగా గొప్ప ఆర్టిస్ట్ మాత్రమే కాదు తన తండ్రిలాగే గొప్ప మనసు ఉన్న వ్యక్తి అని రావు రమేశ్ నిరూపించారు.

Sudheer Babu : అందుకే బ్రహ్మాస్త్ర సినిమా వదులుకున్నాను..

ఇటీవల నటుడు రావు రమేశ్‌ దగ్గర పనిచేసే పర్సనల్ మేకప్ మ్యాన్ బాబు అనారోగ్య సమస్యలతో మరణించాడు. ఇతను చాలా కాలంగా రావు రమేశ్ దగ్గరే పనిచేస్తున్నాడు. అతని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తాజాగా ఆ మేకప్ మ్యాన్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు రావు రమేశ్. అంతే కాక ఆ మేకప్‌మ్యాన్‌ కుటుంబానికి రూ. 10లక్షల చెక్‌ అందించి ఆర్థిక సాయం చేశారు. అలాగే ఏ అవసరం వచ్చినా తన దగ్గరికి రమ్మని, తాను సాయం చేస్తానని మాట ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. అయన చేసిన పనికి అంతా అభినందిస్తున్నారు.