Raashi Khanna: ధనుష్‌తో రాశిఖన్నా.. కెరీర్ టర్నింగ్ అయ్యేనా?
బొద్దుగుమ్మ రాశిఖన్నా ఇప్పుడు స్లిమ్ గా మారి జోరు పెంచేసింది. దక్షణాది అన్ని బాషలలో వరసగా సినిమాలకు సైన్ చేస్తున్న ఈ ఢిల్లీ భామ కెరీర్ టర్న్ చేసే సినిమా కోసం ఎదురు చూస్తుంది.

Rashi Khanna (image:instagram)
Raashi Khanna: బొద్దుగుమ్మ రాశిఖన్నా ఇప్పుడు స్లిమ్ గా మారి జోరు పెంచేసింది. దక్షణాది అన్ని బాషలలో వరసగా సినిమాలకు సైన్ చేస్తున్న ఈ ఢిల్లీ భామ కెరీర్ టర్న్ చేసే సినిమా కోసం ఎదురు చూస్తుంది. రవితేజ, రామ్, నితిన్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలతో వరస సినిమాలు చేసినా రాశికి పెద్ద స్టార్స్ పక్కన అవకాశాలు పెద్దగా దక్కలేదు. చివరికి ఎన్టీఆర్ జైలవకుశ లాంటి హిట్ కూడా రాశికి బడా స్టార్స్ సినిమాలు తేలేకపోయింది.
దీంతో లాక్ డౌన్ లో స్లిమ్ గా మారిన రాశిఖన్నా ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అనే తేడా లేకుండా అరడజనుకు పైగా సినిమాలు చేస్తుంది. వాటిలో అక్కినేని నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’తో పాటు కోలీవుడ్ లో ‘అరణ్‌మణై 3’, కార్తీ ‘సర్దార్’, విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ వంటి సినిమాలు కూడా ఉండగా హిందీలో షాహిద్ కపూర్ ‘సన్నీ’, అజయ్ దేవగణ్ ‘రుద్ర’ వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తుంది.
ఇవే కాకుండా ధనుష్ హీరోగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కూడా రాశిఖన్నా కన్ఫర్మ్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే తమిళంలో రాశికి ఇది బంపర్ అఫర్ అనే చెప్పొచ్చు. అయితే.. ప్రస్తుతం ఇన్ని సినిమాలను క్యూలో పెట్టిన రాశికి కెరీర్ టర్న్ అయ్యేలాంటి హిట్ ఏ సినిమా ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.