×
Ad

Rashmi Gautam : ఫ్యామిలీ మెంబెర్‌ని కోల్పోయిన బాధలో రష్మీ.. అస్థికలతో పోస్టు..

ఫ్యామిలీ మెంబెర్‌ని కోల్పోయిన బాధలో రష్మీ. సంతాపం తెలియజేస్తూ హీరోయిన్ ప్రియమణి కామెంట్.

  • Published On : March 10, 2024 / 07:11 AM IST

Rashmi Gautam shares a emotional post in her instagram

Rashmi Gautam : టాలీవుడ్ స్టార్ యాంకర్ ‘రష్మీ గౌతమ్’ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంటారు. తనకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ, ఇతర సామజిక విషయాలు పై స్పందిస్తూ, ప్రశ్నలు వేస్తూ సందడి చేస్తుంటారు. ముఖ్యంగా మూగ జీవాలు విషయంలో ఈ అమ్మడు వాయిస్ ఎక్కువుగా రైజ్ చేస్తుంటారు. మూగ జీవాలు పై ఎంతో ప్రేమ కలిగిన రష్మీ.. వాటి విషయంలో నెటిజెన్స్ తో సోషల్ మీడియాలో ఫైట్ చేస్తుంటారు.

జంతువులను ఎంతో ప్రేమించే రష్మీ వాటిని ఒక ఫ్యామిలీ మెంబెర్ లా ట్రీట్ చేస్తారు. ఎంతలా అంటే.. తన పెంచుకునే కుక్కకి తన ఇంటి పేరుని ఇచ్చేలా. రష్మీకి ‘చుట్కి గౌతమ్’ అనే ఒక కుక్క ఉంది. ఈ శనివారం ఫిబ్రవరి 9న ఈ చుట్కి చనిపోయిందట. కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఉన్న చుట్కిని కాపాడుకోవడం కోసం రష్మీ చాలా ప్రయత్నించారట. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.

Also read : Allu Ayaan : అప్పుడే జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టిన అల్లు అయాన్..

చివరి 24 గంటలు తన చుట్కి టైం స్పెండ్ చేసిన రష్మీ.. ఆ తరువాత తనకి హిందూ సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే చుట్కి అస్థికలును కూడా సేకరించారు. ఈ ఫోటోలు అన్నిటిని రష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన బాధని వ్యక్తం చేసారు. ఇక ఈ పోస్టు చూసిన హీరోయిన్ ప్రియమణి.. చుట్కికి శాంతి కలగాలంటూ సంతాపం తెలియజేస్తూ కామెంట్ చేసారు.

ఇక రష్మీ ప్రొఫిషినల్ కెరీర్ విషయానికి వస్తే.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా పలు షోలో, ఈవెంట్ లు చేస్తూ వస్తున్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా హీరోయిన్‌గా, లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. గత ఏడాది ఆర్గానిక్ అల్లుడు హైబ్రిడ్ మామ, భోళాశంకర్, హాస్టల్ బాయ్స్ సినిమాలతో ఆడియన్స్ ని పలకరించారు.