Rashmika Mandanna : గొడవ ముగిసిందా.. రిషబ్, రక్షిత్ పై పాజిటివ్ వ్యాఖ్యలు చేసిన రష్మిక..

యాంకర్ రిషబ్ తో ఉన్న వివాదం గురించి అడగగా రష్మిక దానికి సమాధానమిస్తూ.. నిజంగా ఇప్పుడు చెప్తున్నా రక్షిత్ అండ్ రిషబ్ ఇద్దరూ నాకు ఇండస్ట్రీలో............

Rashmika Mandanna : గొడవ ముగిసిందా.. రిషబ్, రక్షిత్ పై పాజిటివ్ వ్యాఖ్యలు చేసిన రష్మిక..

Rashmika Mandanna clarifies about issue with Rishab Shetty

Updated On : July 22, 2023 / 11:50 AM IST

Rashmika Mandanna :  నేషనల్ క్రష్ రష్మిక గత కొన్ని రోజులుగా వివాదాల్లో ఉంటుంది. తనకి పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తన సొంత సినీ పరిశ్రమపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి కొన్ని రోజుల క్రితం. అలాగే తనకి లైఫ్ ఇచ్చిన రిషబ్, రక్షిత్ శెట్టిల గురించి డైరెక్ట్ గా చెప్పకుండా ఎవరో నిర్మాణ సంస్థ ఛాన్స్ ఇచ్చారని చెప్పడం, కన్నడ సూపర్ హిట్ అయిన కాంతార సినిమా చూడలేదు, చూడటానికి ఖాళీ లేదు అని చెప్పడంతో కన్నడ ప్రేక్షకులు ఆమెని విమర్శించారు. కన్నడ పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్స్ కూడా వినిపించాయి.

ఇక రిషబ్ శెట్టి కూడా రష్మిక కి ఇండైరెక్ట్ గా రెండు సార్లు కౌంటర్లు వేయడంతో వీరిద్దరి మధ్య గొడవ ముదిరింది అనుకున్నారు. రిషబ్, రష్మిక మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని కన్నడ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వరుస సినిమాలతో అన్ని పరిశ్రమలలోని బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాల గురించి మాట్లాడింది. ఈ నేపథ్యంలో రిషబ్, రక్షిత్ గురించి కూడా మాట్లాడింది.

Allu Arha : డబ్బింగ్ చెప్తున్న అర్హ.. మురిసిపోయిన అల్లు అర్జున్..

యాంకర్ రిషబ్ తో ఉన్న వివాదం గురించి అడగగా రష్మిక దానికి సమాధానమిస్తూ.. నిజంగా ఇప్పుడు చెప్తున్నా రక్షిత్ అండ్ రిషబ్ ఇద్దరూ నాకు ఇండస్ట్రీలో ఒక మంచి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లిద్దరూ నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళిద్దరి వల్లే ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నాను. మేము ఇద్దరం మాట్లాడుకునే మాటలు కూడా బయటకి చెప్పలేము. నటిగా నాకు తొలి అవకాశాన్ని ఇచ్చి ఒక కొత్త దారిని చూపించారు వాళ్ళు అంటూ చెప్పింది. దీంతో రిషబ్, రష్మిక మధ్య గొడవ ఏమి లేదా గొడవ ముగిసిందా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి దీనిపై రిషబ్ శెట్టి ఎలా స్పందిస్తాడో చూడాలి.