Rashmika Mandanna : పుష్ప 2 డబ్బింగ్ పూర్తిచేసిన రష్మిక మందన్న.. సినిమాపై హైప్ పెంచుతూ పోస్ట్..

తాజాగా రష్మిక మందన్న పుష్ప 2 సినిమాపై అప్డేట్ ఇస్తూ అంచనాలు పెంచింది.

Rashmika Mandanna Completed Dubbing for Pushpa 2 and Shares Photos with Special Post

Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయ్. ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా 17వ తేదీన ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని, ఏడు నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహిస్తామని మూవీ యూనిట్ ఇటీవలే తెలిపింది.

Also Read : Varun Tej : ‘మట్కా’ వాసు పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంత కష్టపడ్డాడో.. మేకోవర్ వీడియో చూశారా?

తాజాగా రష్మిక మందన్న పుష్ప 2 సినిమాపై అప్డేట్ ఇస్తూ అంచనాలు పెంచింది. పుష్ప 2 సినిమాకు డబ్బింగ్ చెప్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. తన డబ్బింగ్ ఫోటోలను షేర్ చేస్తూ.. పుష్ప షూట్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 సెకండ్ హాఫ్ డబ్బింగ్ చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ దానికి మించి ఉంటుంది. నాకు మాటలు రావట్లేదు. మీరు అదిరిపోయే అనుభూతిని పొందబోతున్నారు. సినిమా కోసం నేను ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చింది.

రష్మిక తన పోస్ట్ తో పుష్ప 2 సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ రష్మిక పోస్టుని వైరల్ చేస్తూ పుష్ప 2 ఓ రేంజ్ లో ఉండబోతుందని ఎగ్జైట్ అవుతున్నారు.