Varun Tej : ‘మట్కా’ వాసు పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంత కష్టపడ్డాడో.. మేకోవర్ వీడియో చూశారా?
మేకోవర్ విషయంలో కూడా వరుణ్ బాగానే కష్టపడ్డారు.

Varun Tej Makeover for Matka Vasu Old Age Character Video goes Viral
Varun Tej : వరుణ్ తేజ్ మట్కా సినిమాతో రాబోతున్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, మీనాక్షి జంటగా తెరకెక్కిన మట్కా సినిమా రేపు నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నోరా ఫతేహి, జాన్ విజయ్, కిషోర్ కుమార్, నవీన్ చంద్ర.. ఇలా చాలా మంది స్టార్స్ నటించారు.
1950 – 80 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ గా మట్కా అనే గేమ్ ఆధారంగా ఓ వలస వచ్చిన పేద కుర్రాడు ఎలా డాన్ గా ఎదిగాడు అనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో వరుణ్ తన నట విశ్వరూపం చూపించాడని అంటున్నారు. ఇందులో వరుణ్ నాలుగు ఏజ్ పాత్రల్లో కనిపించబోతున్నాడు.
Also Read : Kiran Abbavaram – Varun Tej : పెళ్లిపై కిరణ్ అబ్బవరం అలా.. వరుణ్ తేజ్ ఇలా.. పెళ్లి తర్వాత సక్సెస్ వస్తుందా?
వివిధ వయసులో కనపడటానికి వరుణ్ చాలా కష్టపడ్డాడట. మేకోవర్ విషయంలో కూడా వరుణ్ బాగానే కష్టపడ్డారు. అలాగే నటన పరంగా కూడా బెస్ట్ ఇచ్చాడని, సింగిల్ టేక్ 6 నిమిషాల సీన్ చేసాడని దర్శకుడు కూడా చెప్పాడు. తాజాగా వరుణ్ తేజ్ మట్కా వాసు ముసలి పాత్ర కోసం ఎలా మారాడు అని మేకోవర్ వీడియోని రిలీజ్ చేసారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో మీరు కూడా చూసేయండి..