Kiran Abbavaram – Varun Tej : పెళ్లిపై కిరణ్ అబ్బవరం అలా.. వరుణ్ తేజ్ ఇలా.. పెళ్లి తర్వాత సక్సెస్ వస్తుందా?

తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత సక్సెస్ అనే దానిపై కామెంట్స్ చేసాడు.

Kiran Abbavaram – Varun Tej : పెళ్లిపై కిరణ్ అబ్బవరం అలా.. వరుణ్ తేజ్ ఇలా.. పెళ్లి తర్వాత సక్సెస్ వస్తుందా?

Kiran Abbavaram and Varun Tej Comments on Success after Marriage

Updated On : November 13, 2024 / 3:08 PM IST

Kiran Abbavaram – Varun Tej : సెలబ్రిటీలు పెళ్లిపై కామెంట్స్ చేస్తే కచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే. ఇటీవల కిరణ్ అబ్బవరం క సినిమాతో సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. క సక్సెస్ తర్వాత కిరణ్ అబ్బవరం ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. నాకు పెళ్లి అయిన తర్వాత సక్సెస్ వచ్చింది. మీరు కూడా పెళ్లి చేసుకోండి, లైఫ్ లో సక్సెస్ వస్తుంది అని అన్నారు. దీంతో కిరణ్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. కిరణ్ తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత సక్సెస్ అనే దానిపై కామెంట్స్ చేసాడు. వరుణ్ లావణ్య త్రిపాఠిని కొన్నేళ్లుగా ప్రేమించి గత సంవత్సరమే పెళ్లి చేసుకున్నాడు. వరుణ్ మట్కా సినిమా రేపు నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ మీమర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఓ మీమర్.. పెళ్లి తరువాత సక్సెస్ వస్తుంది అంటారు, అది మీరు నమ్ముతారా? అని అడిగాడు.

Also See : Jabardasth Satya Sri : జబర్దస్త్ సత్యశ్రీ గృహప్రవేశం.. ఫొటోలు చూశారా..?

దీనికి వరుణ్ తేజ్ సమాధానమిస్తూ.. టైం బాగుంటే వస్తుంది. పెళ్ళికి దానికి సంబంధం లేదు. నేను దాన్ని నమ్మను. లావణ్య నా జీవితంలో 8 ఏళ్ళ నుంచి ఉంది. ఆ ప్రేమ ఎప్పట్నుంచో ఉంది నాకు. సక్సెస్ అని కాదు కానీ ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటే అన్ని మన లైన్లోకి వస్తాయి అని అన్నారు. దీంతో వరుణ్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు ఇలా కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్ వ్యాఖ్యలు కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ పెళ్లి తర్వాత సక్సెస్ వస్తుందా? పెళ్ళికి సక్సెస్ కు సంబంధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.