×
Ad

Rashmika Mandanna : విజ్జు.. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండాలి.. విజయ్ గురించి రష్మిక స్పీచ్ వైరల్..

ఈ ఈవెంట్లో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి మాట్లాడి ఎమోషనల్ అయింది. (Rashmika Mandanna)

Rashmika Mandanna

Rashmika Mandanna : రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ కి నేడు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు. విజయ్ – రష్మిక గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవల కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఈ ఈవెంట్లో కలిసి కనిపిస్తుండటంతో ఈ ఈవెంట్ లో విజయ్, రష్మిక స్పీచ్ ల గురించి, ఫోటోల గురించి ఫ్యాన్స్ ఎదురుచూసారు.(Rashmika Mandanna)

ఈ ఈవెంట్లో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి మాట్లాడి ఎమోషనల్ అయింది. అనంతరం విజయ్ గురించి మాట్లాడుతూ.. విజ్జు.. నువ్వు ఈ సినిమాలో మొదటి నుంచి భాగం అయ్యావు. ఇవాళ సక్సెస్ లో కూడా భాగం అయ్యావు. నాకైతే పర్సనల్ గా ఈ మొత్తం జర్నీలో భాగం అయ్యావు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక విజయ్ దేవరకొండ ఉండాలి అని మాట్లాడింది. దీంతో ఈ స్పీచ్ వైరల్ గా మారింది.

Also Read : Vijay Deverakonda : ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్.. రష్మికకు కిస్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్..

అయితే ఈ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కలిసి కనిపించకుండా ఈవెంట్ టీమ్ జాగ్రత్త పడ్డారు. రష్మిక – విజయ్ ముందే సూచనలు ఇవ్వడంతో వీరిపై కాకుండా సినిమా ఈవెంట్ మీదే ఫోకస్ చేసారు. దీంతో రష్మిక – విజయ్ కలిసి ఉన్న ఒక్క ఫోటో కూడా బయటకు వచ్చేలా కనిపించడం లేదు.

Also Read : Rashmika – Vijay : రష్మిక పెట్టుకుంది.. మరి విజయ్ మర్చిపోయాడు ఏంటి? విజయ్ ఎంగేజ్మెంట్ రింగ్ ఎక్కడ?