×
Ad

Samantha : సమంత సినిమాలు రష్మికకు వెళ్తున్నాయా? మొన్న బాలీవుడ్ సినిమా.. ఇప్పుడు టాలీవుడ్ సినిమా..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సమంత తమిళ్, తెలుగులో వరుస సినిమాలు చేసింది. (Samantha)

Samantha

Samantha : సినీ పరిశ్రమలో ఒకరి సినిమా ఛాన్సులు ఇంకొకరికి వెళ్లడం సాధారణమే. అయితే ఇటీవల సమంత సినిమాలు రష్మికకు వెళ్తున్నాయి అనే టాక్ నడుస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సమంత తమిళ్, తెలుగులో వరుస సినిమాలు చేసింది. కానీ తనకు హెల్త్ సమస్యలు వచ్చినప్పటి నుంచి సినిమాలు తగ్గించేసింది. అడపాదడపా సినిమాలు, బాలీవుడ్ లో సిరీస్ లు చేస్తుంది.(Samantha)

ఇక రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లు కొడుతుంది. సమంత ఇటీవల సినిమాలు తగ్గించేయడంతో తన దగ్గరికి వెళ్లి రిజెక్ట్ అయిన సినిమాలు, పలు కారణాలతో సమంత తప్పుకున్న సినిమాలు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న రష్మిక వద్దకు వెళ్తున్నాయని సమాచారం.

Also Read : Tamannaah Bhatia : పాపం.. అప్పుడూ ఇప్పుడూ తమన్నానే బలి.. కూరలో కరివేపాకు తీసేసినట్టు..

ఇటీవల రష్మిక బాలీవుడ్ లో థామా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మొదట సమంతనే హీరోయిన్ గా అనుకున్నారు. సమంత కూడా ఓకే చెప్పిందట. సమంత, ఆయుష్మాన్ ఖురానా సినిమా అని గతంలో వార్తలు కూడా వచ్చాయి కానీ ఏమైందో చివరకు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక ఈ సినిమాని చేసారు. సమంత ప్లేస్ లో రష్మికని తీసుకున్నారా లేక సమంత తప్పుకుంటే రష్మికను తీసుకున్నారా అనేది మాత్రం ఎవరూ చెప్పలేదు.

ఇప్పుడు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో తీసి డబ్బింగ్ తో వేరే భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ కూడా మొదట సమంత వద్దకు వెళ్లిందట. సమంత స్క్రిప్ట్ మొత్తం చదివింది. కానీ సమంత ఈ కథకు తనకంటే తక్కువ వయసు హీరోయిన్ అయితేనే సరిపోతారు అని చెప్పి డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి చెప్పిందట. అలా ఈ సినిమా కూడా రష్మిక వద్దకు వచ్చింది.

Also Read : Mahesh Babu : బాహుబలి రిలీజ్ బిజీలో రాజమౌళి.. ఈ గ్యాప్ లో సముద్రంలో సాహసాలు చేస్తున్న మహేష్.. పోస్ట్ వైరల్..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ఇప్పుడు సినిమాలు వదిలేసి బిజినెస్ ల మీద ఫోకస్ పెట్టడంతో ఆమెకు రావాల్సిన సినిమాలు కూడా వేరే హీరోయిన్స్ కి వెళ్ళిపోతున్నాయని టాక్. ఈ విషయంలో సమంత ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సమంత రెగ్యులర్ గా సినిమాలు చేయాలని కోరుతున్నారు. సమంత చేతిలో ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా, బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ అనే సిరీస్ ఉన్నాయి.