Rashmika Mandanna : మార్ఫింగ్ వీడియో పై రష్మిక రియాక్షన్.. చదువుతున్న టైంలో ఇలా జరిగితే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియో పై రష్మిక రియాక్ట్ అవుతూ ఒక పోస్ట్ వేశారు.

Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకి సంబంధించిన ఒక మార్ఫింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లో కనిపించారు. అది చూసిన చాలామంది నిజంగా రష్మిక అనుకోని పొరబడ్డారు. అయితే అది ఫేక్ వీడియో అని ఓ వ్యక్తి పోస్టు చేయడం, దాని ఒరిజినల్ వీడియో కూడా షేర్ చేయడంతో అసలు నిజం తెలిసింది.

ఇక ఈ వీడియో పై పలువురు ప్రముఖులు రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే అమితాబ్ బచ్చన్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పని వార్నింగ్ ఇచ్చారు. ఇక దీని పై రష్మిక కూడా స్పందించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టారు. ఆ ఫేక్ వీడియో గురించి మాట్లాడానికి తనకి చాలా ఇబ్బందిగా ఉన్నా మాట్లాడాల్సి ఉందంటూ ఆమె పేర్కొన్నారు.

Also read : Rashmika Mandanna : రష్మిక ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్ర మంత్రి.. సీరియస్ వార్నింగ్ ఇస్తూ పోస్టు

ఆ వీడియో ఆమెను చాలా భయానికి గురి చేసినట్లు చెప్పుకొచ్చారు. కేవలం తనకి ఇలా జరిగినందుకు కాదని, టెక్నాలజీ తప్పుగా ఉపయోగించడం వాళ్ళ తనలా ఎంతోమంది బాధ పడుతుంటారు. ఒకవేళ తను చదువుతున్న టైములో ఇలా జరిగి ఉంటే దానిని తట్టుకోవడం అనేది ఉహించుకోలేనిదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె కోరారు.

అలాగే ఈ వీడియో విషయంలో తనకి సపోర్ట్ గా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ కి చాలా థాంక్యూ అంటూ ఆమె పేర్కొన్నారు. కాగా అసలు వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరంటే.. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అని సమాచారం. ఫేక్ వీడియో స్టార్టింగ్ లో కూడా సరిగ్గా గమనిస్తే.. 1Sec దగ్గర రష్మిక పేస్ కి బదులు జారా పేస్ కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు