Rashmika Mandanna : రష్మిక ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్ర మంత్రి.. సీరియస్ వార్నింగ్ ఇస్తూ పోస్టు

నటి రష్మిక మందన్నా ఫేక్ వీడియోపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. తప్పుడు సమాచార వ్యాప్తిని సోషల్ మీడియా వేదికలు కట్టడి చేయాలని లేదంటే కఠిన చర్యలు తప్పని వార్నింగ్ ఇచ్చారు.

Rashmika Mandanna : రష్మిక ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్ర మంత్రి.. సీరియస్ వార్నింగ్ ఇస్తూ పోస్టు

Rashmika Mandanna

Rashmika Mandanna : రష్మిక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కేంద్రమంత్రి సోషల్ మీడియాలో స్పందించారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు వీటిని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లు కట్టడి చేయాలని సూచించారు.

Rashmika Mandanna : రష్మిక ఫేక్ వీడియో వైరల్.. మరీ ఇంతలా మార్ఫింగ్ చేస్తారా?.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ అమితాబ్ కూడా డిమాండ్..

ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్‌లో నటి రష్మిక మందన్నా దూసుకుపోతున్నారు. వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రష్మికకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్‌లో లిఫ్ట్‌లోకి వచ్చిన వీడియో ఇంటర్నెట్‌లో షేరైంది. ఈ వీడియోలో రష్మిక ఎక్స్‌పోజింగ్ చేసినట్లు కనిపించింది. ఈ వీడియో చూసిన అభిమానులు షాకయ్యారు. అయితే చూడగానే ఇది రష్మిక వీడియో కాదనే విషయం అర్ధమైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్‌కి సంబంధించిన వీడియోను మార్ఫింగ్ చేసి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ సైతం కోరారు. ఇటు నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వీడియోపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఇలా ఫేక్ వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంటర్నెట్ వినియోగదారులకు భద్రత, నమ్మకాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ ఫేక్ వీడియోలు, వార్తల కట్టడి ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌ల బాధ్యత అని స్పష్టం చేశారు.

Rashmika : రష్మికని ఇంకో పెళ్లికి.. ఓకే చెప్పొద్దంటూ సలహా ఇస్తున్న రణబీర్..

ఐటీ చట్టంలోని పలు నిబంధనలను సైతం మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రభుత్వం కానీ, యూజర్లు కానీ తప్పుడు సమాచారంపై ఫిర్యాదు చేసిన 36 గంటల్లో వాటిని తొలగించాలని.. నిబంధనలను పాటించని సోషల్ మీడియా వేదికలపై రూల్ 7 వర్తిస్తుందని చెప్పారు. అవసరమైతే సదరు సోషల్ మీడియా వేదికపై బాధితులు కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన డీప్ ఫేక్ టెక్నాలజీతో తప్పుడు సమాచారం వైరల్ అయ్యే ఆస్కారం ఉన్నందున సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు గట్టి చర్యలు తీసుకోవాలని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచనలు చేశారు.