Rashmika Mandanna : తన మేనేజర్ మోసం చేశాడన్న వార్తలపై రష్మిక రియాక్షన్.. ప్రెస్ నోట్ రిలీజ్!
ఇటీవల రష్మిక తన మేనేజర్ చేతిలో దాదాపు రూ.80లక్షల వరకు మోసం పోయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీని పై రష్మిక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

Rashmika Mandanna released press note on her manager news
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న సౌత్ టు నార్త్ క్రేజీ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. కన్నడ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈ అమ్మడు కెరీర్ స్టార్ చేసిన దగ్గర నుంచి తన వెన్నంటే ఉంటూ ఎంతో నమ్మకంగా పని చేసిన మేనేజర్.. ఇటీవల రష్మిక నుంచి బయటకి వచ్చేశాడు. అయితే మేనేజర్ స్వయంగా రాలేదు. అతను దాదాపు రూ.80లక్షల వరకు మోసం చేసి కాజేసినట్లు, ఇక మోసం తెలుసుకున్న రష్మిక మేనేజర్ ని పనిలో నుంచి తీసేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
Tamannaah : నేను ఏ యాక్టర్ దగ్గర సేఫ్‌గా ఫీల్ అవ్వలేదు.. కానీ విజయ్ వర్మ దగ్గర.. తమన్నా!
అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదట. దీని పై రష్మిక రియాక్ట్ అవుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మేనేజర్ అండ్ రష్మిక విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలియజేసింది. “ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం” అంటూ రష్మిక పేర్కొంది. దీంతో మోసం చేశాడన్న వార్తలకు చెక్ పడింది.

Rashmika Mandanna released press note on her manager news
కాగా ప్రస్తుతం ఈ భామ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. అల్లు అర్జున్ తో పుష్ప 2 (Pushpa 2) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సందీప్‌రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానిమల్ (Animal) మూవీలో హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసి పుష్ప 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.