Rashmika Mandanna : ఐశ్వర్య, రష్మిక వివాదం.. రెస్పాండ్ అయిన రష్మిక.. వివరణ ఇవ్వాల్సిన!

ఇటీవల ఫర్హానా ప్రమోషన్స్ లో ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యలు.. రష్మికతో వివాదానికి దారి తీసింది. తాజాగా దీని పై రష్మిక..

Rashmika Mandanna responds controversy with Aishwarya Rajesh

Aishwarya Rajesh : ఇటీవల టాలీవుడ్‌లో రష్మిక మందన్న (Rashmika Mandanna), ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక వివాదం క్రియేట్ అయ్యింది. ఐశ్వర్య నటించిన తాజా చిత్రం ‘ఫర్హానా’ (Farhana). లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ఇటీవల టాలీవుడ్ లో ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఆ మీడియా ఇంటరాక్షన్ లో తనకి టాలీవుడ్ సినిమాల్లో నటించాలంటే ఇష్టమని, పుష్పలో రష్మిక చేసిన శ్రీవల్లి పత్రాలు తనకి బాగా సెట్ అవుతాయని, అటువంటి పత్రాలు వస్తే చేస్తానని చెప్పుకొచ్చింది.

Pawan – Charan : 15 ఏళ్ళ బ్యాడ్ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి బాబాయ్ అబ్బాయి గేమ్ చెంజర్స్ అవుతారా?

అయితే ఈ వ్యాఖ్యలను కొందరు వేరే కోణంలో రాయడంతో రష్మిక, ఐశ్వర్య ప్రమేయం లేకుండానే ఇద్దరి మధ్య వివాదాన్ని క్రియేట్ చేసింది. దీంతో రష్మిక అభిమానులు ఐశ్వర్య పై సోషల్ మీడియా వేదిక దాడికి దిగారు. ఇక ఇటీవల తన వ్యాఖ్యలు పై వివరణ ఇస్తూ ఐశ్వర్య ఒక నోట్ రిలీజ్ చేసింది. దానికి రష్మిక బదులిస్తూ ట్వీట్ చేసింది. “హాయ్ లవ్ ఈ వివాదం సంగతి నా దృష్టికి ఇప్పుడే వచ్చింది. నువ్వు ఏమి చెప్పాలి అనుకున్నావో నాకు అర్ధమైంది. నువ్వు ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉంది. ఇటీవల విడుదలైన నీ సినిమా ఫర్హానాకి ఆల్‌ ది బెస్ట్‌” అంటూ ట్వీట్ చేసింది.

Aishwarya – Urvashi : కాన్స్‌ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య, ఊర్వశి సందడి.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు!

ఇక రష్మిక ట్వీట్ కి ఐశ్వర్య హార్ట్ సింబల్స్ తో రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదం ముగిసిపోయినట్లు అయ్యింది. కాగా రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో రణ్‌బీర్ తో యానిమల్ సినిమాలో, టాలీవుడ్ అల్లు అర్జున్ తో పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా వైడ్ చిత్రాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.