Pawan – Charan : 15 ఏళ్ళ బ్యాడ్ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి బాబాయ్ అబ్బాయి గేమ్ చెంజర్స్ అవుతారా?
ఖుషీ సినిమా తరువాత నుంచి కంటిన్యూ అవుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి పవన్ అండ్ చరణ్ గేమ్ చెంజర్స్ అనిపించుకుంటారా?

Pawan Kalyan Ram Charan will break flop sentiment with tamil directors
Pawan Kalyan – Ram Charan : మెగా హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తంని రీమేక్ చేస్తూ ‘BRO’ అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు పవన్. ఈ సినిమాలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా నటిస్తున్నాడు. నిన్న (మే 18) ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.
Pawan kalyan : పవన్ బ్యాక్ టు షూట్.. హైదరాబాద్ లో OG సెకండ్ షెడ్యూల్ షూట్..
ఇక రామ్ చరణ్ కూడా తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ (Game Changer) ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి మరో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. RRR తరువాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టాలీవుడ్ లో 15 ఏళ్లగా ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. అదేంటంటే మన హీరోలతో తమిళ డైరెక్టర్స్ చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి.
Ram Charan : బ్రాడ్ పిట్ గురించి నాకు తెలియదు.. కానీ రామ్‌చరణ్ మాత్రం.. ప్రియాంక చోప్రా!
పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య కలయికలో వచ్చిన ఖుషీ సినిమా తరువాత మళ్ళీ ఇప్పటి వరకు ఏ తమిళ దర్శకుడు తెలుగు హీరోలతో హిట్టు కొట్టలేదు. చిరంజీవి – స్టాలిన్, పవన్ – కొమరం పులి, పంజా. మహేష్ బాబు – నాని, స్పైడర్. రామ్ – వారియర్, నాగచైతన్య – కస్టడీ సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. అంతెందుకు ఇప్పుడు పవన్ తో తీస్తున్న సముద్రఖని కూడా తెలుగులో.. జెండా పై కపిరాజు, శంభో శివ శంభో సినిమాలు తెరకెక్కించి ప్లాప్స్ అందుకున్నాడు. మరి ఇప్పుడు ఈ సెంటిమెంట్ ని బాబాయ్ అబ్బాయి బ్రేక్ చేసి గేమ్ చెంజర్స్ అవుతారా? లేదా? చూడాలి.