Rashmika Mandanna : నేను ఏ పని చేసినా విజయ్ సలహా తీసుకోవాల్సిందే.. వ్యక్తిగతంగా నాకు..

తాజాగా రష్మిక బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను వర్క్ చేసిన హీరోల గురించి మాట్లాడింది. ఈ నేపథ్యంలో విజయ్ గురించి అడగ్గా..

Rashmika Mandanna : నేను ఏ పని చేసినా విజయ్ సలహా తీసుకోవాల్సిందే.. వ్యక్తిగతంగా నాకు..

Rashmika Mandanna Reveals how Vijay Deverakonda supports her and Relation between them

Updated On : February 1, 2024 / 8:20 AM IST

Rashmika Mandanna : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న కలిసి రెండు సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. అయితే వీరిద్దరూ కలిసి పార్టీలు చేసుకోవడం, ట్రిప్స్ కి వెళ్లడం.. పలు సంఘటనలతో వీరు ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి.

గతంలో పలుమార్లు మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పారు. ఇటీవల విజయ్ కూడా వీరి పెళ్లి వార్తలను ఖండించారు. కానీ విజయ్, రష్మిక మాత్రం చాలా క్లోజ్ అని అందరికి తెలుసు. తాజాగా రష్మిక బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను వర్క్ చేసిన హీరోల గురించి మాట్లాడింది. ఈ నేపథ్యంలో విజయ్ గురించి అడగ్గా.. మేము కెరీర్ లో ఇద్దరం కలిసి ఎదుగుతున్నాం. నేను చేసే ప్రతి పనిలో అతని సపోర్ట్ ఉంటుంది. నేనేం చేసినా అతని సలహా తీసుకుంటాను. ఏది మంచి, ఏది చెడు అని విజయ్ క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. వ్యక్తిగతంగా జీవితంలో అందరికంటే ఎక్కువగా అతను నాకు సపోర్ట్ చేసాడు. అతన్ని నేను గౌరవిస్తాను అని తెలిపింది.

Also Read : MAD Movie : ఈ సూపర్ హిలేరియస్ కామెడీ ఇచ్చిన చిన్న సినిమాకి సీక్వెల్.. మళ్ళీ వాళ్ళతోనే?

దీంతో మరోసారి విజయ్, రష్మికలు వైరల్ అవుతున్నారు. రష్మిక విజయ్ గురించి ఈ రేంజ్ లో చెప్పిందంటే కచ్చితంగా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని మరోసారి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే అదే ఇంటర్వ్యూలో అమితాబ్ గురించి చెప్తూ.. చాలా సీనియర్ అయినా అమితాబ్ సర్ వయసులో ఎంత చిన్నవాళ్ళని అయినా గౌరవిస్తారు అని చెప్పింది. రణబీర్.. జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకాన్ని ఇచ్చారు అని చెప్పింది.