Sikandar : రష్మిక సినిమా తెలుగులో నో రిలీజ్.. క్యాష్ చేసుకోలేకపోతున్న సల్మాన్.. బాధలో నేషనల్ క్రష్ ఫ్యాన్స్..

ఈ సినిమా విషయంలో తెలుగుతో పాటు సౌత్ రష్మిక ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Rashmika Mandanna Salman Khan Sikandar Movie Not Releasing in Telugu and South Languages

Sikandar : రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకుంది. నేషనల్ క్రష్ గా దేశమంతా అభిమానులను సంపాదించుకుంది. కానీ ఎక్కువ సినిమాలు చేసి, ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది మాత్రం తెలుగులోనే. రష్మిక వేరే సినిమాల్లో సినిమాలు చేస్తే కెరీర్ ఆరంభంలో రిలీజ్ అవ్వకపోయినా ఇపుడు మాత్రం తెలుగులో కూడా డబ్బింగ్ అయి రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల రష్మిక పుష్ప 2, చావా సినిమాలతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ కొట్టింది. ఇప్పుడు మార్చ్ 30 ఉగాది నాడు బాలీవుడ్ లో సల్మాన్ సరసన సికందర్ సినిమాతో రాబోతుంది.

అయితే ఈ సినిమా విషయంలో తెలుగుతో పాటు సౌత్ రష్మిక ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సికందర్ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అవుతుండటం అందుకు కారణం. సౌత్ డైరెక్టర్ AR మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్, రష్మిక జంటగా చాలా మంది సౌత్ ఆర్టిస్టులతోనే తెరకెక్కిన సికందర్ సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అవ్వడం గమనార్హం. ఈ సినిమాలో సత్యరాజ్, కాజల్, కిషోర్.. ఇంకా చాలా మంది సౌత్ ఆర్టిస్టులు ఉన్నారు.

Also Read : Saanve Megghana : SRH మ్యాచ్ లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన శాన్వి మేఘన..

డైరెక్టర్ తమిళ్, రష్మిక సౌత్ లో స్టార్. ఇంతమంది స్టార్స్ ని పెట్టుకొని సౌత్ లో ఒక్క భాషలోకి కూడా డబ్బింగ్ చేయకపోవడం గమనార్హం. ఇటీవల సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తే సౌత్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ సికందర్ సినిమా సౌత్ భాషల్లో రిలీజ్ చేయకపోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంతమంది స్టార్స్ ని పెట్టుకొని సౌత్ లో మార్కెట్ చేసుకునే అవకాశం ఉన్నా సల్మాన్, సినిమా నిర్మాతలు సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోతున్నారు అని అంటున్నారు సినీ వర్గాలు.

హిందీ వర్షన్ లో మాత్రం కొన్ని మెయిన్ సిటీస్ లోని మాల్స్ లో కొన్ని షోలు వేస్తున్నారు సికందర్ సినిమాకు. రష్మిక అయినా చెప్పి ఉండాల్సింది సికందర్ సినిమాని తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయాలని అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం హిందీలో రిలీజయి అంత కలెక్ట్ చేస్తుందా చూడాలి. లేదా అక్కడ రిజల్ట్ చూసి చావా లాగా కొన్ని రోజుల తర్వాత ఇక్కడ రిలీజ్ చేస్తారా చూడాలి.

Also Read : Rashmika Mandanna : రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా? బాగానే సంపాదించిందిగా..