Rashmika Mandanna : రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా? బాగానే సంపాదించిందిగా..
గత సంవత్సరమే రష్మిక ఫోర్బ్స్ ఇండియాలో అండర్ 30 లిస్ట్ లో చేరింది.

Rashmika Mandanna Properties Value According to Forbes India
Rashmika Mandanna : కన్నడ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన రష్మిక మందన్నా ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నేషనల్ క్రష్ గా స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. ప్రస్తుతం రష్మిక నేషనల్ వైడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. ఇటీవల పుష్ప 2, చావా సినిమాలతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉంది. త్వరలో సల్మాన్ ఖాన్ సికందర్ సినిమాతో రానుంది. దీంతో గత కొన్ని రోజులుగా రష్మిక వైరల్ అవుతుంది.
తన సినిమాలు, కన్నడ వివాదాలతో వార్తల్లో నిలిచే రష్మిక తాజాగా మరోసారి తన ఆస్తితో వార్తల్లో నిలిచింది. రష్మికకు ప్రస్తుతం 28 ఏళ్ళు. గత సంవత్సరమే రష్మిక ఫోర్బ్స్ ఇండియాలో అండర్ 30 లిస్ట్ లో చేరింది. తాజాగా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం రష్మిక ఆస్తుల విలువ 66 కోట్ల రూపాయలు అని సమాచారం.
Also Read : LYF (Love Your Father) : ఎస్పీ చరణ్ లైఫ్(లవ్ యువర్ ఫాదర్) ట్రైలర్ చూశారా..?
ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకు 3 కోట్ల నుంచి 8 కోట్ల వరకు తీసుకుంటుంది. సౌత్ లో కాస్త తక్కువ, బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
రష్మికకు ముంబైలో సొంత ఫ్లాట్ ఉంది. అలాగే హైదరాబాద్, బెంగుళూరు, గోవా, కూర్గ్ లో కూడా ఆమెకు పలు స్థిరాస్థులు ఉన్నాయి. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెడుతుందట.
అలాగే రష్మిక తన తండ్రి బిజినెస్ లో కొంత పెట్టుబడి పెట్టిందని సమాచారం.
రష్మిక దగ్గర ఆడీ Q3, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, బెంజ్ కంపెనీల ఖరీదైన కార్లు ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో కొనుక్కున్న క్రెటా కార్ కూడా ఇంకా ఉందట తన దగ్గర.
Also Read : Robinhood : ‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ.. డేవిడ్ వార్నర్ ఫస్ట్ తెలుగు సినిమా ఎలా ఉంది?
రష్మిక అనేక బిజినెస్ బ్రాండ్స్, కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది.
సోషల్ మీడియాలో రష్మికకు 45 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తుంది.
రష్మిక 2016లో సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చింది. తొమ్మిదేళ్లలోనే 66 కోట్ల ఆస్తులు సంపాదించిందని సమాచారం. ఇప్పుడున్న హిట్స్, సినిమాలు, క్రేజ్ చూస్తుంటే త్వరలో రష్మిక 100 కోట్ల ఆస్తి సంపాదిస్తుందని అంటున్నారు.
ఇక రష్మిక గత కొన్నాళ్ల నుంచి విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు లీక్ అయ్యాయి. కానీ వీరు మాత్రం అధికారికంగా స్పందించట్లేదు.