LYF (Love Your Father) : ఎస్పీ చరణ్ లైఫ్(లవ్ యువర్ ఫాదర్) ట్రైలర్ చూశారా..?

మీరు కూడా లైఫ్ ట్రైలర్ చూసేయండి..

LYF (Love Your Father) : ఎస్పీ చరణ్ లైఫ్(లవ్ యువర్ ఫాదర్) ట్రైలర్ చూశారా..?

SP Charan Lyf Love Your Father Trailer Released by Mallareddy

Updated On : March 28, 2025 / 6:36 PM IST

LYF (Love Your Father) : దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ చాన్నాళ్ల తర్వాత మళ్ళీ నటుడిగా రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్). మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాణంలో పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ సినిమా తెరకెక్కుతుంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా భావన పోలేపల్లి పనిచేసింది.

Also Read : Ram Charan Birthday Celebrations : చీరపై చరణ్ పేరు.. రామ్ చరణ్ బర్త్ డేకి జపాన్ ఫ్యాన్స్ ట్రీట్..

తాజాగా ఈ సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజీ ఆవరణలో నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈవెంట్ కి ఎమ్మల్యే మల్లారెడ్డి గెస్ట్ గా వచ్చారు. మీరు కూడా లైఫ్ ట్రైలర్ చూసేయండి..

ట్రైలర్ చూస్తుంటే తండ్రి కొడుకులు ప్రేమగా ఉండటం, వీరి మధ్యలోకి ఓ విలన్ రావణ, శివ శక్తితో హీరో గెలవడం కథాంశంతో సినిమా అందబోతుందని తెలుస్తుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. మల్లారెడ్డి గారు ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండేది. ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే పాన్ వరల్డ్ సినిమా అయ్యేది. ఆయన నటించకపోవడం వల్ల పాన్ ఇండియా సినిమా అయ్యిందని అన్నారు. సింగర్ SP చరణ్ మాట్లాడుతూ.. హీరో శ్రీ హర్ష ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. వారణాసిలో ఆయన ఎక్కువ కష్టపడ్డాడు. ఇంతమంచి సినిమాలో యాక్టింగ్ కి ఛాన్స్ ఇచ్చి పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని అన్నారు.

Also Read : Robinhood : ‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ.. డేవిడ్ వార్నర్ ఫస్ట్ తెలుగు సినిమా ఎలా ఉంది?

MLA మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా అన్నారు. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్ గా ఉన్నారు. శ్రీ హర్ష మా కాలేజీ స్టూడెంట్, వాళ్ళ తండ్రి మా కాలేజీ ప్రిన్సిపాల్.. వీళ్ళు సినిమా చెయ్యడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. చరణ్ గారు ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం గారు చరణ్ గారిని మనకు గిఫ్ట్ గా ఇచ్చారు. బాలు గారు లేని లోటు చరణ్ తో తీరిపోయింది అని అన్నారు.

SP Charan Lyf Love Your Father Trailer Released by Mallareddy