Robinhood : ‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ.. డేవిడ్ వార్నర్ ఫస్ట్ తెలుగు సినిమా ఎలా ఉంది?

రాబిన్ హుడ్ అంటే డబున్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్లకు పంచడం. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి.

Robinhood : ‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ.. డేవిడ్ వార్నర్ ఫస్ట్ తెలుగు సినిమా ఎలా ఉంది?

Nithiin Sreeleela David Warner Robinhood Movie Review and Rating

Updated On : April 18, 2025 / 8:24 PM IST

Robinhood Movie Review : నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘రాబిన్‌హుడ్‌’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యెర్నేని నవీన్, రవిశంకర్ నిర్మాణంలో వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్, దేవదత్త, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. రాబిన్ హుడ్ సినిమా నేడు మార్చి 28న‌ థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. రామ్(నితిన్)ఓ అనాథ. చిన్నప్పుడు ఓ పెద్దాయన(శుభలేఖ సుధాకర్) అతన్ని అనాథాశ్రమంలో జాయిన్ చేసి ఆ ఆశ్రమానికి డబ్బులు ఇచ్చి త్వరలో వస్తాను అని వెళ్ళిపోతాడు. ఆ పెద్దాయన రాడు, ఆశ్రమానికి విరాళాలు రావు. దీంతో ఆశ్రమంలో ఉన్న ఫ్రెండ్స్ కోసం రామ్ దొంగగా మారి డబ్బున్నోళ్ల దగ్గర కొట్టేసి అనాథల కోసం ఖర్చుపెడుతూ ఉంటాడు. పెద్దయ్యాక కూడా ఈ దొంగతనాలు రాబిన్ హుడ్ పేరిట కొనసాగిస్తాడు రామ్. దీంతో రాబిన్ హుడ్ ని పట్టుకోవాలని పోలీసాఫీసర్ విక్టర్‌(షైన్‌ చాం టాకో) అతన్ని టార్గెట్ గా పెట్టుకుంటాడు.

ఈ విషయం తెలిసి కొన్నాళ్ళు దొంగతనాలకు దూరంగా ఉందామని రామ్.. జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్‌) నడిపే ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి ఓ ఇండియన్ బిజినెస్ మెన్ కూతురు నీరా వాసుదేవ్(శ్రీలీల)ఇండియాకు రావడంతో రామ్ ఆమెకు సెక్యూరిటీగా వెళ్తాడు. కానీ నీరాని గంజాయి సాగు చేసే రౌడీ సామి (దేవదత్తా నాగే) మనుషులు రుద్రకొండకు వచ్చేలా చేస్తారు. నీరాని ఎందుకు రుద్రకొండకు రప్పించారు? రామ్ నీరాని కాపాడతాడా? విక్టర్ రామ్ ని పట్టుకుంటాడా? రామ్ ని అనాథాశ్రమంలో చేర్పించిన పెద్దాయన ఏమయ్యాడు? డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..

సినిమా విశ్లేషణ.. రాబిన్ హుడ్ అంటే డబున్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్లకు పంచడం. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కథ అయినా కొన్ని ట్విస్ట్ లు కాస్త కామెడీ, ఇంకోకథ జోడించి కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో హీరో దొంగగా ఎలా మారాడు, ఎందుకు మారాడు, హీరోని పోలీసులు పట్టుకోడానికి ట్రై చేయడం, హీరో సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి హీరోయిన్ కి సెక్యూరిటీగా వెళ్లడంతో సాగుతుంది. ఇంటర్వెల్ సింపుల్ గా ఇచ్చేసారు. సెకండ్ హాఫ్ లో నీరాని రామ్ కాపాడటం, కొన్ని ట్విస్ట్ లతో సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ లో మొదట కాసేపు సాగదీసినా హీరోయిన్ ఎంట్రీ నుంచి కామెడీ బాగానే వర్కౌట్ అయింది. నితిన్ – రాజేంద్రప్రసాద్ – వెన్నెల కిషోర్ ముగ్గురి మధ్య మంచి కామెడీ పండింది. ఇక సెకండ్ హాఫ్ లో కామెడీ తగ్గి కమర్షియల్ వైపు మారుతుంది కథ. కాస్త సీరియస్ గా అక్కడక్కడా సాగదీసినట్టు ఉంటుంది సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కామెడీ ఉన్నా కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. ట్విస్ట్ లు కొన్ని మెప్పిస్తాయి. డేవిడ్ వార్నర్ పాత్ర క్లైమాక్స్ లో విలన్ షేడ్స్ లో వచ్చి పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

Robinhood

నటీనటుల పర్ఫార్మెన్స్.. నితిన్ ఎప్పట్లాగే కమర్షియల్ హీరోగా కనిపించి మెప్పించాడు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ఫుల్ గా నవ్విస్తారు. శ్రీలీల పాత్ర అందాల ఆరబోత తప్ప నటనకు పెద్దగా స్కోప్ లేదు. దేవదత్త నాగే, మైమ్ గోపి నెగిటివ్ షేడ్స్ లో భయపెట్టిస్తారు. శుభలేఖ సుధాకర్, ఆడుకాలం నరేన్, షైన్ టామ్ చాకో.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పిస్తారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ రోల్ లో కాసేపే కనిపించినా టాలీవుడ్ ఎంట్రీతో మంచి హైప్ ఇచ్చాడు. ఐటెం సాంగ్ తో కేతిక శర్మ అదిదా సర్ ప్రైజు అంటూ అదరగొట్టేసింది.

Also Read : Robinhood Twitter Review : నితిన్ ‘రాబిన్‌హుడ్’ ట్విట్ట‌ర్ రివ్యూ.. డేవిడ్ వార్న‌ర్ రోల్ ఇదే!

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. పాటలు మాత్రం యావరేజ్. కొన్ని కామెడీ పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. పాత కథని కొత్తగా చూపించి నవ్వించే ప్రయత్నం చేసాడు దర్శకుడు వెంకీ కుడుముల. నిర్మాణ పరంగా ఎక్కువే ఖర్చుపెట్టినట్టు తెరపై ఆ గ్రాండియర్ కనిపిస్తుంది.

మొత్తంగా ‘రాబిన్ హుడ్’ సినిమా దొంగతనాలు చేసే వ్యక్తి సెక్యూరిటీగా మారి ఏం చేసాడు అని కామెడీ టచ్ తో ఆసక్తిగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.