Rashmika Mandanna : ఆ ఫ్లాప్ సినిమానే నాకు ఇష్టం.. రష్మిక వ్యాఖ్యలు.. పుష్ప 2 గురించి కూడా ఏం చెప్పిందంటే..

రష్మిక మందన్న త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతుంది.

Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్, బాలీవుడ్ లో దూసుకుపోతుంది. త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతుంది. పుష్ప 1లో శ్రీవల్లి పాత్రలో డీ గ్లామర్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా రష్మికకు మరింత మైలేజ్ తెచ్చింది. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పార్ట్ 2లో కూడా రష్మిక పాత్ర ఎక్కువ సేపే ఉంటుందని, పార్ట్ 1 కంటే ఇంకా బాగుంటుందని వినిపిస్తుంది.

తాజాగా రష్మిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి 2.0ని చూస్తారు. పుష్ప 1 చేస్తున్నప్పుడు ఎక్కువ అంచనాలు లేవు. కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయి పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెట్టడంతో మా పాత్రలపై కూడా మరింత బాధ్యత పెట్టింది. పార్ట్ 1 కంటే కూడా ఈ సినిమాకి ఎక్కువ కష్టపడ్డాను అని తెలిపింది.

అలాగే తాను నటించిన వాటిల్లో తనకు నచ్చిన సినిమా గురించి అడగ్గా.. డియర్ కామ్రేడ్(Dear Comrade) సినిమా నా మనసుకి నచ్చిన సినిమా. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవచ్చు కానీ ఇందులోని నా పాత్రకు, నా నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. నా అభిమానులందరికి ఆ పాత్ర బాగా నచ్చింది. అందుకే డియర్ కామ్రేడ్ సినిమా నా హృదయానికి దగ్గరైంది అని తెలిపింది.

Also Read : Chiranjeevi : డూప్ లేకుండా 68 ఏళ్ళ వయసులో మెగాస్టార్ యాక్షన్ సీన్స్.. ‘విశ్వంభర’ కోసం చిరు సాహసం..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమా థియేటర్స్ లో అంతగా ఆడలేదు. పాటలు బాగున్నా స్లో నెరేషన్ ఉండటం, లెంగ్త్ ఎక్కువ ఉండటంతో ఎక్కువ మందికి కనెక్ట్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా రష్మికకు నచ్చింది అని చెప్పడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు