Chiranjeevi : డూప్ లేకుండా 68 ఏళ్ళ వయసులో మెగాస్టార్ యాక్షన్ సీన్స్.. ‘విశ్వంభర’ కోసం చిరు సాహసం..

విశ్వంభర మూవీ అప్డేట్స్ రెగ్యులర్ గా ఇస్తున్నారు. ఇటీవల ఈ సెట్ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం, చిరు లుక్స్ కూడా రిలీజ్ చేసారు.

Chiranjeevi : డూప్ లేకుండా 68 ఏళ్ళ వయసులో మెగాస్టార్ యాక్షన్ సీన్స్.. ‘విశ్వంభర’ కోసం చిరు సాహసం..

Chiranjeevi Doing Action Scenes with out Dupe in Vishwambhara Movie

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర'(Vishwambhara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విశ్వంభర మూవీ అప్డేట్స్ రెగ్యులర్ గా ఇస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇటీవలే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ అయిందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ ముచ్చింతల్ లో వేసిన ఆంజినేయ స్వామి విగ్రహం సెట్ వద్ద యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

ఇటీవల ఈ సెట్ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం, చిరు లుక్స్ కూడా రిలీజ్ చేసారు. డైరెక్టర్ వశిష్ట కూడా భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నామని పోస్ట్ కూడా చేసాడు. తాజాగా చిరంజీవి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. నాకు ఇంకా ఓపిక ఉంది. సినిమా కోసం, అభిమానుల కోసం ఎంతైనా కష్టపడతాను. ఇటీవల విశ్వంభర షూటింగ్ లో యాక్షన్ సీన్ చేయడానికి నా డూప్ ని తీసుకొచ్చారు. నేను ఎందుకు అంటే భారీ యాక్షన్ సీన్ చెప్పారు. ఆ సీన్ విన్న తర్వాత పర్లేదు డూప్ వద్దు నేను చేసేస్తాను అని చెప్పాను. నాకు ఇంకా ఓపిక ఉంది. అలాంటి యాక్షన్ సీన్స్ అభిమానుల కోసం నేనే చేస్తాను అని తెలిపారు.

Also Read : Chiranjeevi – Meher Ramesh : మెగాస్టార్‌తో మళ్ళీ మెహర్ రమేష్.. అయ్యా వద్దయ్యా అంటున్న ఫ్యాన్స్, నెటిజన్స్..

దీంతో చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 68 ఏళ్ళ వయసులో అభిమానుల కోసం సినిమాలు తీయడమే గ్రేట్ అంటే అందులో యాక్షన్ సీన్స్ కూడా చిరంజీవి డూప్ లేకుండా చేయడం అంటే అభినందించాల్సిందే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు అని అభిమానులు, నెటిజన్లు బాస్ ని పొగిడేస్తున్నారు.