Allu Arjun : అల్లు అర్జున్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపిన రష్మిక..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హీరోయిన్ రష్మిక ఓ స్పెషల్ గిఫ్ట్ పంపింది.

Rashmika Mandanna special gift to Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హీరోయిన్ రష్మిక ఓ స్పెషల్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు.
ఎవరికైనా మనం వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుందని మా అమ్మ చెప్పేది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్, మీకు మరింత అదృష్టం తీసుకువస్తుందని అనుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు అని రష్మిక ఓ లేఖ పంపింది. దీన్ని బన్నీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. ‘ఇప్పుడు చాలా అదృష్టం కావాలి డియర్’ అని రాసుకొచ్చారు.
సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక జంటగా పుష్ప 2 మూవీలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. పుష్ప చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
Delhi Ganesh : సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత..
దేశంలోని ఏడు నగరాల్లో పుష్ప 2 సినిమా ఈవెంట్స్‌ని నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్, హైదరాబాద్ లలో పుష్ప 2 మాసివ్ ఈవెంట్స్‌ను నిర్వహించబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను బీహార్ లోని పాట్నాలో గ్రాండ్ గా చేయబోతున్నట్టు చెప్పింది.