రష్మిక మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. వీడియో అదిరిపోయిందంతే..
ఈ సినిమాలో రష్మికకు జోడీగా కన్నడ యాక్టర్ నాని దసరాఫేం దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు.

Rashmika Mandanna
The Girlfriend Movie: రష్మిక మందన్నా ప్రధానపాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా గురించి ఇవాళ గీతా ఆర్ట్స్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాను నవంబరు 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాను విభిన్నమైన ప్రేమ కథతో రాహుల్ రవీంద్రన్ తీస్తున్నారు. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాకు సంబంధించిన టీజర్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. అలాగే, ఈ సినిమా నుంచి విడుదలైన “నదివే” పాట సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది.
రాహుల్ రవీంద్రన్ గతంలో చిలసౌతో పాటు మన్మథుడు 2 సినిమాలను రూపొందించారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మికకు జోడీగా కన్నడ యాక్టర్ నాని దసరాఫేం దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు.
WHO IS YOUR TYPE?
Let’s have this conversation with #TheGirlfriend in theaters from NOVEMBER 7th, 2025 ✨
In Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam ❤️ #TheGirlfriendOnNov7th#WhoIsYourType@iamRashmika @Dheekshiths @23_rahulr @HeshamAWMusic… pic.twitter.com/e0mJht9RPH
— Geetha Arts (@GeethaArts) October 4, 2025