Rashmika Mandanna : మరోసారి రష్మికని ట్రోల్ చేస్తున్న కన్నడ ఆడియన్స్.. పాపం రష్మికకు ప్రతిసారి ఇంతే..

అప్పుడప్పుడు అనుకోకుండా రష్మిక మాట్లాడే మాటలతో కన్నడ వాళ్ళను హర్ట్ చేసి ట్రోల్ అవుతుంది.

Rashmika Mandanna Trolled by Kannada Audience due to her Comments again

Rashmika Mandanna : కర్ణాటక లోని విరాజ్ పేట్ అనే ప్రాంతం నుంచి వచ్చింది రష్మిక. మొదటి సినిమా కన్నడలోనే చేసి హిట్ కొట్టి పాపులర్ అవ్వడంతో ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం రష్మిక నేషనల్ వైడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా రష్మిక మాట్లాడే మాటలతో కన్నడ వాళ్ళను హర్ట్ చేసి ట్రోల్ అవుతుంది.

గతంలో ఓ సారి తన మొదటి సినిమా, మొదటి సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడకపోవడంతో కన్నడ సినిమా లవర్స్ ఫీల్ అయి ఆమె సినిమాలని, ఆమెని కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ కూడా చేస్తామని హడావిడి చేసారు. ఇప్పుడు మరోసారి రష్మిక చేసిన కామెంట్స్ కి కన్నడ వాళ్ళు హర్ట్ అయి ట్రోల్ చేస్తున్నారు.

Also Read : Nag Ashwin : ప్రభాస్ కల్కి 2 పక్కన పెట్టేసి.. వేరే సినిమా ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్.. ఆ హీరోయిన్ తో..?

రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో చావా సినిమా సందడిలో ఉంది. విక్కీ కౌశల్, రష్మిక జంటగా శివాజీ తనయుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ఫిబ్రవరి 14న రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రస్తుతం మంచి విజయంతో దూసుకుపోతుంది. అయితే రష్మిక ఎక్కువ తెలుగు సినిమాలు చేయడం, ఇక్కడే ఎక్కువ గుర్తింపు రావడంతో చావా సినిమా ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనెక్కడో హైదరాబాద్ నుంచి వచ్చాను. అయినా సరే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారంటూ ఆడియన్స్ ని ఉద్దేశించి మాట్లాడింది.

ఇంకేముంది మామూలుగానే కన్నడ వాళ్ళు వాళ్ళ భాష, ప్రాంతం గురించి గొడవలు చేస్తారు. అలాంటిది పుట్టిన ఊరు, వచ్చిన ప్రాంతం మర్చిపోతే ఊరుకుంటారా. రష్మిక బేసక్ గా కన్నడ అమ్మాయి. అలాంటిది కర్ణాటక నుంచి వచ్చానని చెప్పకుండా హైదరాబాద్ అని చెప్పడం, అందులోనూ కన్నడని అసలు మర్చిపోవడంతో కన్నడ ఆడియన్స్ హర్ట్ అయ్యారు. దాంతో సోషల్ మీడియాలో రష్మికను ఏకిపారేస్తున్నారు.

Also Read : Marco : మలయాళం మోస్ట్ వైలెంట్ సినిమా మార్కో.. తెలుగు డబ్బింగ్.. ఆహా ఓటీటీలో ఎప్పటినుంచంటే..?

ఎక్కడనుంచి వచ్చామన్నది మర్చిపోతే ఎలా..? హైదరాబాద్ ని కర్ణాటక లో ఎప్పుడు విలీనం చేసారు? మరి విరాజ పేట్ ఎక్కడుంది? అంటూ రకరకాల కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. రష్మిక ఇలా ట్రోల్ అవ్వడం కొత్తకాదు. అంతకుముందు కూడా ఓ ఇంటర్వ్యూ లో రష్మికకి ఫస్ట్ చాన్సిచ్చిన రిషబ్ శెట్టి ఎవరో తెలీనట్టు బిహేవ్ చెయ్యడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.

రష్మిక సొంత సినిమా ఇండస్ట్రీ అయిన కన్నడ ని లైట్ తీసుకుందని, అమానించిందని బాగా కాంటవర్సీ ఫేస్ చేసింది రష్మిక. ఆ తర్వాత రష్మిక క్లారిటీ ఇచ్చినా నెటిజన్స్ మాత్రం అంత ఈజీగా వదిలపెట్టలేదు రష్మిక ని. ఇప్పుడు మరోసారి కన్నడ ని లైట్ తీస్కుందని కన్నడ ఆడియన్స్ ఫీలవ్వడంతో ఇలా మరోసారి రష్మికను ట్రోల్ చేస్తున్నారు.