Nag Ashwin : ప్రభాస్ కల్కి 2 పక్కన పెట్టేసి.. వేరే సినిమా ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్.. ఆ హీరోయిన్ తో..?
ప్రభాస్ ఫ్రీ అయ్యే వరకు ఖాళీగా ఉండటం ఎందుకు అనుకుంటున్నాడట నాగ్ అశ్విన్.

Nag Ashwin Planning New Movie before Prabhas Kalki 2 Rumors goes Viral
Nag Ashwin: టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల రేసులో పోటీపడుతున్న దర్శకులలో నాగ్‌అశ్విన్ కూడా ఒకరు. తను తెరకెక్కించిన మూడు సినిమాలతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. కల్కి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ విక్టరీ కొట్టాడు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రానికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి 2 ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రభాస్ వరుసగా రాజాసాబ్, హను రాఘవపూడి, సలార్ 2, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవి ఎప్పుడు అవుతాయో కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. కల్కి-2 ఇప్పట్లో ట్రాక్ ఎక్కే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఈ గ్యాప్‌లో ఓ చిన్న సినిమా చేయాలనుకుంటున్నాడట నాగ్ అశ్విన్.
Also Read : Marco : మలయాళం మోస్ట్ వైలెంట్ సినిమా మార్కో.. తెలుగు డబ్బింగ్.. ఆహా ఓటీటీలో ఎప్పటినుంచంటే..?
ఆల్రెడీ కల్కి-2 స్క్రిప్ట్ రెడీ చేసుకొని, ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి రెడీగా ఉన్న నాగ్ అశ్విన్.. ప్రభాస్ ఫ్రీ అయ్యే వరకు ఖాళీగా ఉండటం ఎందుకు అనుకుంటున్నాడట. డార్లింగ్ కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యేలోపు ఓ మీడియం మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడట నాగ్ అశ్విన్. ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ ఈ సినిమా చేయబోతున్నట్టు టాక్.
నాగ్ అశ్విన్ బాలీవుడ్ భామ అలియాభట్ తో ఓ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే అలియాతో కూడా చర్చలు జరుపుతున్నారట. అలియా ఓకే అంటే మీడియం రేంజ్ లో ఈ సినిమాని నిర్మించనున్నారు. ప్రస్తుతం అలియా ఓ సినిమా షూట్ లో ఉంది. ఒకవేళ అలియా నాగ్ అశ్విన్ కి ఓకే చెప్తే నవంబర్ లో ఈ సినిమా షూట్ మొదలుపెట్టి సమ్మర్ కి పూర్తిచేసెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. చాలా తక్కువ టైమ్‌లోనే షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
Also Read : Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’.. ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?
ఇదే నిజం అయితే ఎలాంటి లవ్ స్టోరీని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తాడోనన్న ఆసక్తి కొనసాగుతోంది. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వార్త విని ప్రభాస్ ని కర్ణుడిగా చూడటానికి ఇంకా వెయిట్ చేయాల్సిందేనా అని నిరాశ చెందుతున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ క్లారిటీ రాదు. మొత్తానికి నాగ్ అశ్విన్ ప్రభాస్ కల్కి 2 సినిమా పక్కన పెట్టి అలియాతో సినిమా చేస్తాడు అని సినీ పరిశ్రమలో చర్చగా మారింది.