Rashmika Mandanna: పెళ్లి తర్వాత కూడా రష్మిక స్పీడ్ తగ్గదు.. వరుస క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద నేషనల్ క్రష్ హవా
పెళ్లి తరువాత కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఒకే చేసిన రష్మిక మందన్నా(Rashmika Mandanna).
rashmika mandanna upcoming movies list
- పెళ్లి తరువాత రష్మిక క్రేజీ లైనప్
- తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజీ
- లిస్టులో భారీ సినిమాలు
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం తన కెరీర్లో టాప్ పొజిషల్ లో ఉంది. వ్యక్తిగత జీవితం గురించి ఎన్ని వార్తలు వస్తున్నా.. పెళ్లి తర్వాత కూడా సినిమా ప్రయాణాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆమె తన లైనప్‌తో స్పష్టం చేస్తోంది. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి తర్వాత కెరీర్ విషయంలో కాస్త స్లో అవుతారు, కానీ రష్మిక విషయంలో మాత్రం అది రివర్స్ గా ఉంది.
ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే రాబోయే రెండు మూడేళ్లు బాక్సాఫీస్ వద్ద ఆమె హవా గట్టిగా కొనసాగుతుందని అర్థమవుతోంది. మరీ, ముఖ్యంగా పాన్ ఇండియా లెవల్లో రష్మిక (Rashmika Mandanna)క్రేజ్ భారీగా పెరిగింది. ఇప్పటికే, ఆమె ‘పుష్ప 3’లో కూడా శ్రీవల్లిగా సందడి చేయబోతుదన్న విషయం తెలిసిందే. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోయే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో ప్లాన్ చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో కూడా రష్మిక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇది పట్టాలెక్కితే ఐకాన్ స్టార్‌తో ఆమె హ్యాట్రిక్ కొట్టినట్టే.
Shruti Haasan: బంగారు బొమ్మలా శృతి హాసన్.. నెటిజన్ల మనసు దోచేస్తున్న అందం
బాలీవుడ్లో కూడా రష్మిక జోరు తగ్గడం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సెన్సేషనల్ హిట్ తర్వాత, దాని సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ సరసన గీతాంజలి పాత్రలో ఆమె మరోసారి తన నటనతో మెప్పించనుంది. అలాగే ‘కాక్టెయిల్ 2’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది రష్మిక.
మరోవైపు విభిన్నమైన కథాంశాలతో వస్తున్న ‘మైసా’, ‘రణబాలి’ వంటి సినిమాలు రష్మిక నటనలోని కొత్త కోణాలను ఆవిష్కరించనున్నాయి. ఇక రణబాలి విషయానికి వస్తే, ఈ సినిమాలో ఆమె చాలా కాలం తరువాత భర్త విజయ్ దేవరకొండతో నటిస్తోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తను ఒక కంప్లీట్ ప్యాకేజీ అని నిరూపించుకుంటోంది. ఈ భారీ లైనప్ చూస్తుంటే, పెళ్లి తర్వాత కూడా రష్మిక తన స్టార్‌డమ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
