రష్మికను ఇబ్బంది పెట్టకండి.. ట్రోల్ చెయ్యొద్దు: అభిమానులకు హీరో రిక్వెస్ట్

  • Published By: vamsi ,Published On : December 23, 2019 / 07:52 AM IST
రష్మికను ఇబ్బంది పెట్టకండి.. ట్రోల్ చెయ్యొద్దు: అభిమానులకు హీరో రిక్వెస్ట్

Updated On : December 23, 2019 / 7:52 AM IST

కన్నడ నాట సినిమా ఇంస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్టార్‌గా ఎదిగిన  హీరోయిన్ రష్మిక మందన. ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి దగ్గరైన ఈ భామ… ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంది. రష్మిక ప్రస్తుతం మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుంది.

ఇదిలా ఉంటే రష్మిక నటించిన ‘కిర్రాక్‌ పార్టీ’ సినిమా హీరో రక్షిత్‌ శెట్టితో కొంతకాలం క్రితం 2017లో నిశ్చితార్థం చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2018లో రక్షిత్‌ శెట్టి రష్మిక విడిపోయారు. ఈ బ్రేకప్‌పై కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి లేటెస్ట్‌గా ‘అతడే శ్రీమన్నారాయణ’ ప్రమోషన్స్‌లో మాట్లాడారు. మన జీవితం ఎన్నో రకాల అనుభవాలను పరిచయం చేస్తుంది. అయితే అందులో కొన్ని మంచి అనుభవాలు, మరికొన్నిసార్లు చెడ్డ అనుభవాలై ఉండొచ్చు. కాబట్టి ప్రతి అనుభవాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. మనిషి ఎదిగే క్రమంలో ప్రేమ, స్నేహం, మొదలైన విషయాల్లో హార్ట్‌బ్రేక్స్‌ ఉంటాయి. అంటూ తన లవ్ బ్రేక్ అప్ గురించి బయటపెట్టాడు రక్షిత్ శెట్టి.

ఇదే సమయంలో రష్మికను కన్నడనాట కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈవిషయంపై మాట్లాడిన రక్షిత్ శెట్టి.. అభిమానులకు కొన్ని సూచనలు చేశాడు. రష్మికను ఇబ్బందిపెట్టకండి, తనని సంతోషంగా ఉండనివ్వండి. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చెయ్యకండి అంటూ విజ్ఞప్తి చేశాడు.