Rashmika
Rashmika : తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతుంది రష్మిక. ఇటీవలే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. త్వరలోనే తన బాలీవుడ్ ఫస్ట్ సినిమా కూడా రానుంది. ఇక నేషనల్ క్రష్ పేరుతో చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ తో ‘పుష్ప’ సినిమా చేస్తుంది. రష్మికకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంది. సౌత్ హీరోయిన్స్ లో టాప్ లో ఉంది రష్మిక. ఇంత క్రేజ్ ఉంటే ఎవరైనా తమకు బ్రాండింగ్ చేయించుకోవడానికి చూస్తారు. రష్మికకి ఇటీవల యాడ్స్ కూడా బాగానే వస్తున్నాయి. తాజాగా మెక్ డొనాల్డ్స్ తో కలిసి ఓ కొత్త ప్రయోగం చేస్తుంది రష్మిక.
Fariya Abdullah : ‘బంగార్రాజు’ సినిమాలో చిట్టి స్పెషల్ సాంగ్??
రష్మిక క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ రష్మికతో ఒప్పందం కుదుర్చుకుంది. నిన్న నవంబర్ 19 నుంచి మెక్ డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ఫుడ్ ను అందిస్తుంది. రష్మిక అభిమానులను ఆనందపరిచేందుకు రష్మికతో ఒప్పందం చేసుకొని రష్మిక ఫేవరేట్ ఫుడ్ ని ‘ది రష్మిక మీల్’ అని ప్రత్యేకంగా అందిస్తుంది మెక్‌డొనాల్డ్స్.
Pushpa : ‘పుష్ప’ సాంగ్ కోసం తన రెండు గాజులు అమ్ముకున్న హీరోయిన్
ఈ రష్మిక మీల్ లో రష్మికకు ఇష్టమైన మెక్ స్పైసి, ఫ్రైడ్ చికెన్, మెక్ స్పైసి చికెన్ బర్గర్, పెరి పెరి ఫ్రైస్, నింబూ ఫిజ్, మెక్ ఫ్లరీ ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన మీల్ గురించి రష్మిక మాట్లాడుతూ.. మెక్‌డొనాల్డ్స్ నా కంఫర్ట్ ఫుడ్. మెక్‌స్పైసీ చికెన్ బర్గర్‌లో పెరి పెరి ఫ్రైస్‌ని ఉంచడం నాకు ఇష్టం. జీవితంలోని పెద్ద, చిన్న సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకోవడానికి మెక్‌ఫ్లరీ మరొక మార్గం. నా మెక్‌డొనాల్డ్స్ ఫేవరెట్‌లను అందరితో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక రష్మిక అభిమానులు మెక్ డొనాల్డ్స్ కి క్యూ కట్టనున్నారు.
drum rolls ?
Introducing ? #TheRashmikaMeal ?.
Order now.P.S. – There might be a special surprise coming soon to your ?s. Stay tuned to know more!@mcdonaldsindia#mcdonaldsindia#Partnership pic.twitter.com/LSuRIsC6S2
— Rashmika Mandanna (@iamRashmika) November 19, 2021