Ratan Tata – Amitabh Bachchan : అన్నిట్లో సక్సెస్ అయిన రతన్ టాటా.. సినిమాల్లో మాత్రం.. అమితాబ్‌తో సినిమా తీసి..

ఎన్నో రకాల బిజినెస్ లలో సక్సెస్ అయిన రతన్ టాటా సినిమాలో మాత్రం ఫెయిల్ అయ్యారు.

Ratan Tata – Amitabh Bachchan : అన్నిట్లో సక్సెస్ అయిన రతన్ టాటా.. సినిమాల్లో మాత్రం.. అమితాబ్‌తో సినిమా తీసి..

Ratan Tata Failed in Movies with Producing a Movie with Amitabh Bachchan

Updated On : October 10, 2024 / 4:24 PM IST

Ratan Tata – Amitabh Bachchan : భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నిన్న రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్స్ కు ఎన్నో విజయాలను అందించారు రతన్ టాటా. అలాగే ఎన్నో వేలకోట్లు దానం చేసి మంచిపేరు కూడా తెచ్చుకున్నారు. ఆయన మరణంతో దేశంలో విషాదం నెలకొంది. ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అయితే ఎన్నో రకాల బిజినెస్ లలో సక్సెస్ అయిన రతన్ టాటా సినిమాలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఓ సినిమాకు ఆయన డబ్బులు పెట్టి సహా నిర్మాతగా వ్యవహరించారు. అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ముఖ్య పాత్రల్లో విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏత్‌బార్‌. ఈ సినిమా 2004లో రిలీజయింది. ఈ సినిమాకు రతన్ టాటా సహా నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 10 కోట్లు పెట్టి తెరకెక్కించారు. ఈ సినిమా పరాజయం పాలైంది.

Also Read : Vettaiyan : ‘వేట్టయన్’ మూవీ రివ్యూ.. రొటీన్ కథకు సూపర్ స్టార్ హంగులు..

అయితే అమితాబ్ తో ఉన్న స్నేహంతోనే ఈ సినిమాకు రతన్ టాటా పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మరోసారి సినిమాల వైపుకు వెళ్ళకూడదు అని అనుకున్నారట రతన్ టాటా. ఆ తర్వాత సినిమాల్లో రతన్ టాటా పెట్టుబడులు పెట్టలేదు. దీంతో రతన్ టాటా నిర్మించిన ఏకైక సినిమాగా ఏత్‌బార్‌ నిలిచింది. ఎప్పుడో వచ్చి వెళ్లిపోయిన ఈ సినిమా ఇప్పుడు రతన్ టాటా మరణంతో మరోసారి వైరల్ అవుతుంది.