Ravi Teja Anupama Kavya Thapar Eagle Movie Twitter Review
Eagle Twitter Review : మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’. ఈ సినిమాలో కావ్య తపర్ హీరోయిన్ గా నటిస్తుంటే అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ చిత్రం హాలీవుడ్ స్టాండర్డ్ ట్రైలర్ అండ్ టీజర్స్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఇవాళ థియేటర్స్ లోకి వచ్చేసిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా..?
Also read : Lal Salaam Twitter Review : రజినీకాంత్ ‘లాల్ సలామ్’ ట్విట్టర్ టాక్ ఏంటి.. ఆడియన్స్ ఏమంటున్నారు..?
మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించేలా ఉందట. హీరో గురించి తమకి తెలిసిన కథని అనేక మంది వారివారి కోణాల్లో చెబుతూ కథ స్టార్ట్ అవుతుందట. ఈక్రమంలో రవితేజ చాలా తక్కువ సీన్స్ మాత్రమే కనిపిస్తారట. ఇది కొంచెం నిరాశ పరుస్తుందని చెబుతున్నారు. అయితే సినిమాటోగ్రఫీ పై అవగాహన ఉన్న దర్శకుడు.. కొన్ని సీన్స్ ని హాలీవుడ్ స్థాయిలో చూపించి వావ్ అనిపించారట.
#Eagle
Very good 1st half, Opens up the story via multiple perspectives which at times feel a bit slow. Raviteja has only few scenes but was great in those! Cinematography stands out!— Vamsi (@sosobratuku) February 9, 2024
రవితేజకి సీన్స్ అండ్ డైలాగ్స్ తక్కువ ఉన్నపటికీ, ఇతర పాత్రలతో రవితేజని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారట. కానీ ఆ ఎలివేషన్ డైలాగ్స్ కూడా సీన్ కి తగ్గట్టు ఉండవని చెబుతున్నారు. సినిమాని ముందుకు తీసుకు వెళ్లడంలో కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ స్టైల్ ని ఉపయోగించుకున్నట్లు అనిపిస్తుందని చెబుతున్నారు.
Also got a feeling that the director was heavily inspired from Vikram movie as the narrative pattern, elevations are in similar format #Eagle https://t.co/EP0AiVTcFk
— sharat ? (@sherry1111111) February 9, 2024
మొత్తానికి ఫస్ట్ హాఫ్ బీలో యావరేజ్ గా ఉంటే, సెకండ్ హాఫ్ యావరేజ్ గా నిలిచిందని చెబుతున్నారు. శృతిమించిన ఎలివేషన్స్, ఫ్లాట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో మూవీ ఏవరేజ్ గా ఉందని చెబుతున్నారు. అయితే ఈ చిత్రానికి సెకండ్ పార్టుని కూడా అనౌన్స్ చేశారట. సెకండ్ పార్ట్ కోసం ఈ మూవీలో కథని అంతా సెటప్ చేసినట్లు అనిపిస్తుందట.
#Eagle below avg first half and avg second half ?? Raviteja gave his best, too many elevations with flat bgm ? Everything setup for Part- 2.
My Rating: 2.25-2.5/5 ⭐️⭐️ #EagleReview pic.twitter.com/Qvi9j6KPhi— Daniel Sekhar (@rk_mahanti) February 8, 2024