×
Ad

Mass Jathara OTT: గుడ్ న్యూస్.. ఓటీటీకి వచ్చేసిన మాస్ జాతర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర(Mass Jathara OTT). శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించాడు.

Ravi teja mass jathara movie now streaming on netflix

Mass Jathara OTT: మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర(Mass Jathara OTT). శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించాడు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. గతంలో రవి తేజ, శ్రీలీల నటించిన ధమాకా సూపర్ హిట్ అయ్యింది. అదే రేంజ్ లో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నారు అంతా. కానీ, విడుదల తరువాత ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు ఈ సినిమా.

Naveen Polishetty: ప్రమాదంలో చేయి, వెన్నెముకకు గాయాలు.. అసలు సినిమాలు చేయగలనా.. నవీన్ ఎమోషనల్ కామెంట్స్

మాస్ ఎలిమెంట్స్ ఒక రేంజ్ లో ఉన్నప్పటికీ కంటెంట్ మరీ రోటీన్ గా ఉండటంతో ఆడియన్స్ కి అంత ఎక్కలేదు ఈ సినిమా. అందుకే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. నవంబర్ 28 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే, థియేటర్స్ లో ఈ సినిమాను ఎక్కువమంది చూడలేదు కాబట్టి ఓటీటీ మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన కళా చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల తో “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే సినిమా చేస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా హిట్స్ లేని రవితేజ కనీసం ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.