Ravibabu : మరోసారి ‘రష్’ అంటూ అదరగొడుతున్న రవిబాబు..

రవిబాబు ఇటీవల కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని తాజాగా ఓ ఓటీటీ సినిమాతో పలకరించాడు.

Ravibabu Rush Movie : నటుడిగా, దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. దర్శకత్వంలో ఆయన సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని తెలిసిందే. అల్లరి, నచ్చావులే, మనసారా, అనసూయ, అమరావతి, అవును, అవును 2.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో పలకరించిన రవిబాబు ఇటీవల కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని తాజాగా ఓ ఓటీటీ సినిమాతో పలకరించాడు.

రవిబాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తూ, కథ – స్క్రీన్ ప్లే అందించిన‌ సినిమా ‘రష్’. సతీశ్ పోలోజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో డైసీ బోపన్న మెయిన్ లీడ్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ రష్ సినిమా ఇటీవల జూన్ 13 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : Honeymoon Express : ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ.. రొమాంటిక్ ఎంటర్టైనర్..

ఒక సాధార‌ణ గృహిణికి కొన్ని అనుకోని ప‌రిస్థితులు ఎదురైతే ఆమె వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కొంది అనే ఆసక్తికర కథాంశంతో యాక్ష‌న్ సినిమాగా ఈ రష్ ని తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో ఓ సోష‌ల్ ఇష్యూ గురించి కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ రష్ సినిమా ఈటీవి విన్ ఓటీటీలో దూసుకుపోతుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే రష్ చూసేయండి ఓటీటీలో.

ట్రెండింగ్ వార్తలు