Ravibabu : హీరోయిన్ పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. కానీ.. రవిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

రవిబాబు తీసిన అవును, అవును 2, లడ్డు బాబు, అదుగో, అసలు సినిమాల్లో పూర్ణ నటించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా అని గతంలో రూమర్స్ కూడా వచ్చాయి.

Ravibabu comments on Heroine Poorna goes viral

Ravibabu :  నటుడిగా, డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. తన డైరెక్షన్ లో వచ్చే సినిమాలన్నీ చాలా కొత్తగా ఉంటాయి. గత కొన్నాళ్ల నుంచి నటుడిగా అప్పుడప్పుడు మంచి సినిమాలు చేస్తున్నా డైరెక్టర్(Director) గా మాత్రం ఇటీవల రవిబాబు(Ravibabu) తీసిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇక రవిబాబు సినిమాల్లో ఇటీవల ఎక్కువగా హీరోయిన్ పూర్ణ(Poorna) కనిపిస్తుంది.

రవిబాబు తీసిన అవును, అవును 2, లడ్డు బాబు, అదుగో, అసలు సినిమాల్లో పూర్ణ నటించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా అని గతంలో రూమర్స్ కూడా వచ్చాయి. తాజాగా రవిబాబు దర్శకత్వంలో పూర్ణ మెయిన్ లీడ్ లో నటించిన అసలు సినిమా డైరెక్ట్ ఈ విన్ ఓటీటీలో రిలీజయింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవిబాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూర్ణతో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడాడు.

Producer Chittibabu : సమంత కెరీర్ అయిపొయింది.. సెంటిమెంట్ డ్రామాలతో సినిమాలు రిలీజ్ చేస్తుంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత..

వరుసగా పూర్ణని తన సినిమాల్లో తీసుకోవడం గురించి ఇంటర్వ్యూలో అడగగా రవిబాబు మాట్లాడుతూ.. అవును పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది. కానీ మీరు అనుకునేది కాదు. ప్రతి దర్శకుడికి తన నటీనటులతో ఓ ప్రేమ అనుబంధం ఉంటుంది. నాకు కూడా పూర్ణతో అలాంటి అనుబంధమే ఉంది. పూర్ణ దర్శకుడు చెప్పిన దానికంటే ఇంకా బాగా చేస్తుంది. నా సినిమాల్లో హీరోయిన్ అంటే ఇప్పుడు అందరికి పూర్ణనే గుర్తొస్తుంది. అయినా నేను డైరెక్టర్ కాబట్టి నా అన్ని సినిమాలు పూర్ణ ఒప్పుకోదు. కథ నచ్చితేనే ఒప్పుకుంటుంది. నేను తర్వాత తీయబోయే వాషింగ్ మెషిన్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేయమని పూర్ణను అడిగాను. దానికి నో చెప్పింది. అంతే తప్ప నా కోసం నా సినిమాల్లో నటించట్లేదు అని అన్నారు. దీంతో రవిబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.