Producer Chittibabu : సమంత కెరీర్ అయిపొయింది.. సెంటిమెంట్ డ్రామాలతో సినిమాలు రిలీజ్ చేస్తుంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత..
తాజాగా టాలీవుడ్ లోని ఓ నిర్మాత సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పటి తెలుగు నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి కామెంట్స్ చేశారు.

Producer Chittibabu sensational comments on Samantha
Producer Chittibabu : సమంత(Samantha) గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. చైతూతో విడాకులు, ఆ తర్వాత ఐటెం సాంగ్ చేయడం, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నాని అని చెప్పడం, ఇప్పుడు శాకుంతలం(Shakunthalam) పాన్ ఇండియా సినిమా.. ఇలా గత కొన్నాళ్లుగా సమంత ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది. విడాకుల తర్వాత అసలు కొన్నాళ్ళు కనపడకుండా పోయిన సమంత యశోద(Yashoda) సినిమా రిలీజ్ కి ముందు వచ్చి హెల్త్ బాగోలేకపోయినా డబ్బింగ్ చెప్పాను, ఆ తర్వాత నాకు మాయోసైటిస్ సోకింది అని ఎమోషనల్ గా మాట్లాడింది.
ఇన్నాళ్లు విడాకులు, ఆ తర్వాతి లైఫ్ గురించి మాట్లాడని సమంత శాకుంతలం ప్రమోషన్స్ లో మాత్రం విడాకుల తర్వాత నా లైఫ్ అలా మారిపోయింది, ఈ రెండేళ్లలో చాలా కష్టాలు పడ్డాను, బాధలు చూశాను, ఆరోగ్యం సహకరించట్లేదు అని మళ్ళీ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. సమంతని అయ్యో పాపం అని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మరో పక్క సినిమాల రిలీజ్ లకు ముందే ఇలాంటి ఎమోషనల్స్ గుర్తొస్తాయని కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. నేడు ఏప్రిల్ 14న సమంత శాకుంతలం పాన్ ఇండియా రిలీజ్ ఉండటంతో గత కొన్ని రోజులుగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.
తాజాగా టాలీవుడ్ లోని ఓ నిర్మాత సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పటి తెలుగు నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ.. సమంత కెరీర్ అయిపోయింది. విడాకుల తర్వాత ఆమె బతకాడానికి ఐటెం సాంగ్ చేసింది. ఆమె సెంటిమెంట్ డ్రామాలతో ప్రేక్షకులని రప్పించాలని చూస్తుంది. యశోద సినిమా టైంలో ఆరోగ్యం బాగోలేకపోయినా డబ్బింగ్ చెప్పాను అంటూ ప్రమోట్ చేసుకుంది. గతంలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఆరోగ్యం బాగోలేకపోయినా వచ్చి షూటింగ్స్ చేశారు. క్యాన్సర్ వచ్చినా కూడా వచ్చి సినిమాలు చేశారు. ఇప్పుడు శాకుంతలం రిలీజ్ కి ముందు మళ్ళీ ఆరోగ్య సమస్యలు అని, పర్సనల్ బాధలని మాట్లాడుతుంది. చచ్చిపోయేలోపు ఈ ప్రాజెక్టు చేస్తానో చేయనో అని చెప్పింది. ఇలా సెంటిమెంట్ డ్రామాలు ఆడి, మీడియా ముందు ఏడ్చేస్తే ప్రేక్షకులు వస్తారనుకుంటుంది. ఒకవేళ వచ్చినా సినిమా బాగుంటేనే హిట్ అవుతుంది. ఇప్పుడు సమంతకు స్టార్ డం లేదు. అసలు అలాంటి హీరోయిన్ ని శాకుంతలం లాంటి మంచి కథకు ఎందుకు తీసుకున్నారో తెలియట్లేదు అని కామెంట్స్ చేశారు.
Alia Bhatt : యాక్టింగ్ గురించి సలహా అడిగితే.. రాజమౌళిపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు..
దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా సమంత అభిమానులు విమర్శిస్తుంటే పలువురు మాత్రం అవును నిజమే కదా అని కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి వాటిపై సీరియస్ గా స్పందించే సమంత మరి ఈ వ్యాఖ్యలకు స్పందిస్తుందా చూడాలి.