Ravibabu Ester Movie Shooter Releasing
Shooter : ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన నటుడు, దర్శకుడు రవిబాబు ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. రవిబాబు ముఖ్య పాత్రలో శ్రీ వెంకట సాయి బ్యానర్ పై శెట్టిపల్లి శ్రీనివాసులు దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘షూటర్’. రవిబాబు, ఎస్తర్ నోరాన్హా, ఆమని, రాశి, సుమన్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
పలుమార్లు వాయిదా పడిన షూటర్ సినిమా ఇప్పుడు జూన్ 7న థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో షూటర్ మూవీ దర్శక నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ.. సమాజలోని యదార్థ ఘటనల నేపథ్యంలో షూటర్ ని తెరకెక్కించాం. ఈ నెల 7న థియేటర్ లలో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా అందరూ చూడొచ్చు అని తెలిపారు. ఈ ఈవెంట్లో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దామోదర ప్రసాద్, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, పలువురు మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.