Shooter Movie : రవిబాబు ‘షూటర్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

తాజాగా షూటర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

Shooter Movie : రవిబాబు ‘షూటర్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

Ravibabu Shooter Movie First Look Released and Release Date Announced

Updated On : January 18, 2025 / 9:21 PM IST

Shooter Movie : ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన నటుడు, దర్శకుడు రవిబాబు గత కొన్నాళ్లుగా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు రవిబాబు. శ్రీ వెంకట సాయి బ్యానర్ పై శెట్టిపల్లి శ్రీనివాసులు దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘షూటర్’. రవిబాబు, ఎస్తర్ నోరాన్హా, ఆమని, రాశి, సుమన్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Also Read : Bhatti Vikramarka : ఉగాది రోజే గద్దర్ అవార్డుల ప్రదానం.. ఇకపై ప్రతి ఉగాదికి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. షూటర్ సినిమా ఫిబ్రవరి 22న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Ravibabu Shooter Movie First Look Released and Release Date Announced

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఓ విభిన్న కథ, కథనంతో షూటర్ సినిమాని తెరకెక్కించాము. రవిబాబు, ఆమని, ఎస్తర్, రాశి.. లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. సుమన్, అన్నపూర్ణమ్మ, సత్యప్రకాష్, సమీర్, జీవా.. ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 22న ఈ సినిమా శ్రీలక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు గారు ద్వారా రిలీజ్ కానుంది అని తెలిపారు.

Also Read : Identity : త్రిష మలయాళం హిట్ సినిమా ఐడెంటిటీ.. ఇప్పుడు తెలుగులో రిలీజ్.. ఎప్పుడంటే..